Bank loans: ఆ ఒక్కటీ ఉంటే.. లోన్ ఎంత కావాలంటే అంత.. చాలా ఈజీగా పొందొచ్చు..

రుణం కోసం దరఖాస్తు చేసుకోగానే బ్యాంకులు వెంటనే మంజూరు చేయవు. రుణం కోరుతున్న వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలను పరిశీలిస్తాయి. అవి అనుకూలంగా ఉన్నప్పుడే రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకులు పరిశీలించే అంశాలలో క్రెడిట్ స్కోర్ అత్యంత ముఖ్యమైనది. ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే రుణం త్వరగా మంజూరవుతుంది. క్రెడిట్ స్కోర్ ను చాలా రుణాలు పొందేందుకు ప్రధాన అర్హతగా ఉంది.

Bank loans: ఆ ఒక్కటీ ఉంటే.. లోన్ ఎంత కావాలంటే అంత.. చాలా ఈజీగా పొందొచ్చు..
Bank Loan
Follow us
Madhu

|

Updated on: Jun 01, 2024 | 5:48 PM

జీవితంలో ప్రతి ఒక్కరికీ అనేక లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తారు. సాధారణంగా ఉన్నత చదువు చదవడం, వ్యాపారం ప్రారంభించడం, ఇల్లు లేదా కారు తదితర వాటిని కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు. ఇవి సంపన్న వర్గాల ప్రజలకు చాలా సులభంగా తీరే కోరికలే. కానీ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలపై ఆధారపడతారు. వాటి నుంచి రుణం తీసుకుని, ప్రతినెలా వాయిదాల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. ఈ వాయిదాలో రుణం, వడ్డీ కలిపి ఉంటుంది. గతంతో పోల్చితే ఇప్పుడు బ్యాంకులు రుణాలు విరివిగా, వేగంగా అందిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాధాన్యం అంశాలు వారు సరిచూసుకున్నాక మాత్రమే లోన్లు మంజూరు చేస్తారు.

క్రెడిట్ స్కోర్ అత్యంత ప్రధానం..

రుణం కోసం దరఖాస్తు చేసుకోగానే బ్యాంకులు వెంటనే మంజూరు చేయవు. రుణం కోరుతున్న వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలను పరిశీలిస్తాయి. అవి అనుకూలంగా ఉన్నప్పుడే రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకులు పరిశీలించే అంశాలలో క్రెడిట్ స్కోర్ అత్యంత ముఖ్యమైనది. ఈ స్కోర్ ఎక్కువగా ఉంటే రుణం త్వరగా మంజూరవుతుంది. క్రెడిట్ స్కోర్ ను రుణం పొందటానికి ప్రధాన అర్హతగా చెప్పవచ్చు. ఇది తక్కువగా ఉన్న వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి.

ఈ అంశాలను పరిశీలించండి..

రుణం పొందాలనుకునేవారు ముందుగా తమ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవాలి. ఈ క్రింది తెలిపిన అంశాలను చాలా జాగ్రత్తగా పాటించడం ద్వారా స్కోర్ పెంచుకోవడంతో పాటు రుణాలను సులభంగా పొందే అవకాశం ఉంది.

  • బ్యాంకులు ముందుగా దరఖాస్తుదారుడి ఆదాయం, అప్పులు తదితర వాటిని పరిశీలిస్తాయి. అతడికి రుణం మంజూరు చేస్తే ప్రతి నెలా సక్రమంగా చెల్లించగలడో, లేదో లెక్కలు వేసుకుంటాయి. అతడికి వచ్చే ఆదాయంలో అప్పులకు ఎంత కడుతున్నాడో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. ఆదాయంలో 40 శాతానికి మించి రుణాలకు చెల్లించేవారికి రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆలోచిస్తాయి. 60 శాతానికి మించితే దాదాపు మంజూరు చేయవు. కాబట్టి రుణాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు పాత రుణాలను తీర్చేయడం ఉత్తమం. అలాంటప్పుడే కొత్త రుణం త్వరగా మంజూరువుతుంది.
  • బ్యాంకుల నుంచి రుణం మంజూరు కావాలంటే తమ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. తీసుకున్నరుణం సక్రమంగా కట్టగలరో లేదో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 కన్నా ఎక్కువగా ఉంటే రుణాలు త్వరగా మంజూరవుతాయి. 700 ఉన్నా పర్వాలేదని కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డును ఎక్కువగా వాడడం వల్ల కూడా స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ వినియోగం 40 శాతానికి మించితే స్కోర్ దెబ్బతింటుంది. రుణాల కోసం తరచూ బ్యాంకులను దరఖాస్తు చేస్తున్నా ప్రతికూల ప్రభావం పడుతుంది. తక్కువ కాలంలో ఎక్కువగా రుణాలు తీసుకున్నా స్కోర్ తగ్గుతుంది.
  • సాధారణంగా హోమ్ లోన్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకుంటారు. లోన్ సులభంగా పొందడానికి ఒక మార్గం ఉంది. అదే జీవిత భాగస్వామితో కలిసి దరఖాస్తు చేసుకోవడం. అలాంటప్పుడు రుణం త్వరగా మంజూరవుతుంది. కొన్ని బ్యాంకులు తండ్రి, తల్లి, కొడుకు, కుమార్తె వంటి కుటుంబ సభ్యులనూ సహ దరఖాస్తుదారుగా అనుమతి ఇస్తున్నాయి.
  • బ్యాంకులు స్టెప్ అప్ పద్దతిలో కొందరికి రుణాలు మంజూరు చేస్తాయి. వీటికి ప్రారంభంలో తక్కువ ఈఎమ్ఐ ఉంటుంది. క్రమంగా మీ జీతం పెరిగేకొద్దీ వాయిదా మొత్తం పెరుగుతూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి జీతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో వారికి రుణాలు మంజూరు చేస్తారు. కానీ వడ్డీరేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!