Gold Investment: బంగారంపై పెట్టుబడి లాభమా? నష్టమా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మాత్రం ఇబ్బందే..

ఇటీవల కాలంలో కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా చాలా పెట్టుబడి దారులు గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ మార్కెట్ గురించి, దానిలోని బేసిక్ విషయాల గురించి పెట్టుబడి పెట్టాలనుకొనే వారు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

Gold Investment: బంగారంపై పెట్టుబడి లాభమా? నష్టమా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మాత్రం ఇబ్బందే..
Gold Investment
Follow us
Madhu

|

Updated on: Jul 12, 2023 | 4:00 PM

తరాలు మారినా బంగారానికి విలువ తరగలేదు. రాజుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ అతి ప్రీతికరమైన, విలువైన వస్తువు బంగారమే. ప్రతి ఒక్కరికీ ఈ పసుపు వర్ణపు లోహంపై మక్కువ ఉంటుంది. ఏమాత్రం ఇంట్లో నగదు ఉన్నా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. బంగారు రేటు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. దీంతో అందరూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా చాలా పెట్టుబడి దారులు గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ మార్కెట్ గురించి, దానిలోని బేసిక్ విషయాల గురించి పెట్టుబడి పెట్టాలనుకొనే వారు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకొనే వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలను మీకు తెలియజేస్తున్నాం.

అధిక లిక్విడిటీ.. బంగారాన్ని ఎప్పుడైనా, ఏ పరిస్థితిలోనైనా సులభంగా నగదుగా మార్చగలిగే పెట్టుబడిగా అందరూ పరిగణిస్తారు. మన దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా లిక్విడ్ పరిగణించబడే ఏకైక పెట్టుబడిగా ఇది కొనసాగుతోంది.

తరగని విలువ.. కరెన్సీ తర్వాత విలువైన వాటిల్లో బంగారం ఒకటని, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఇది సురక్షితమైనదిగా మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.

ఇవి కూడా చదవండి

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం నుంచి రక్షణ లభిస్తుంది. మార్కెట్‌లోని అతి తక్కువ అస్థిర ఆస్తి తరగతుల్లో బంగారం ఒకటి. చాలా సులభంగా నగదుగా మార్చుకోవచ్చు.

బంగారాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టొచ్చంటే..

  • భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం
  • గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ పెట్టుబడులు
  • గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా యూనిట్ ట్రస్ట్‌లు
  • గోల్డ్ మైనింగ్ స్టాక్స్

ఈ విషయాలు మర్చిపోవద్దు..

బంగారం స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌ల పనితీరు నిజమైన బంగారంతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. వస్తువు డిమాండ్, సరఫరా, దేశ ఆర్థిక పరిస్థితులు మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొ బంగారం ధర నిర్ణయిస్తారు. బంగారం పరిశ్రమలోని ఒక సంస్థ బంగారం ధరలలో మార్పుల వల్ల వెంటనే ప్రభావితమవుతుంది. ఈ కంపెనీల స్టాక్‌ల ధరను ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా, గోల్డ్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, కంపెనీ లేదా ప్లాన్‌పై విస్తృతమైన పరిశోధన చేయడం అవసరం. అయితే మీరు భౌతిక బంగారంపై పెట్టుబడి పెడితే అది అత్యంత సురక్షిత, స్థిరమైన పెట్టుబడిగా నిలుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..