UAN Process: మీరు ఉద్యోగం మారారా? మీ పీఎఫ్ ఖాతా బదిలీ చేయడానికి ఆ ఒక్కటి చాలు
ఉద్యోగం మారిన సమయంలో యూఏఎన్ ద్వారా పీఎఫ్ ఖాతాను ఎలా మార్చుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను కేటాయిస్తుంది. యూఏఎన్ అనేది ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య . యూఏఎన్ నంబర్ పోర్టబుల్, అంటే ఇది ఒక యజమాని నుండి మరొకరికి బదిలీ అవుతుంది.

ప్రస్తుతం మారుతున్న కాలం ప్రకారం ఉద్యోగావకాశాలు విరివిగా పెరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగం మారడం అనేది సాధారణ విషయంగా మారింది. అయితే ఉద్యోగం అంటేనే మనం బతకుదెరువు. ఉద్యోగ సమయంలోనే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించి మనం పని చేసే సంస్థ కొంత భాగం, మన జీతంలోంచి కొంత బాగం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. అయితే ఉద్యోగంలో ఉన్నంత సేపు పర్వాలేదు కానీ ఉద్యోగం మానేసే పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా ట్రాన్స్‌ఫర్ అనేది ఓ ప్రహసనంలా ఉంటుంది. ఈ ఇబ్బందుల నుంచి ఉద్యోగులను బయటపడేయడానికి యూనివర్శల్ అకౌంట్ నెంబర్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఉద్యోగం మారిన సమయంలో యూఏఎన్ ద్వారా పీఎఫ్ ఖాతాను ఎలా మార్చుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను కేటాయిస్తుంది. యూఏఎన్ అనేది ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య . యూఏఎన్ నంబర్ పోర్టబుల్, అంటే ఇది ఒక యజమాని నుండి మరొకరికి బదిలీ అవుతుంది. ఇది ఉద్యోగులు వారి ఈపీఎఫ్ సహకారాలను ట్రాక్ చేయడం, ప్రయోజనాలను క్లెయిమ్ చేయడం సులభం చేస్తుంది. యూఏఎన్ నంబర్ ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఉద్యోగులు తమ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, వారి పాస్‌బుక్‌ను వీక్షించడానికి, ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి ఈ యూఏఎన్ నెంబర్‌ను మన కొత్త కంపెనీ వారికి ఇస్తే సింపుల్‌గా మన పీఎఫ్ ఖాతాను బదిలీ చేస్తారు. దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే?
యూఏఎన్ అనేది ఈపీఎఫ్‌ఓ ప్రతి సభ్యునికి అందించి 12 అంకెల సంఖ్య. యూఏఎన్ ఒక వ్యక్తికి కేటాయించిన బహుళ సభ్యుల ఐడీలకు గొడుగులా పని చేస్తుంది. ఒకే సభ్యునికి ఒకే యూనివర్సల్ ఖాతా సంఖ్య కింద కేటాయించిన బహుళ సభ్యుని గుర్తింపు సంఖ్యలను (సభ్యుని ఐడి) లింక్ చేయడానికి ఈ నంబర్ పనిచేస్తుంది. కేవైసీ వివరాలతో యూఏఎన్ సక్రమంగా సీడ్ అవుతుంది. ఇది యజమాని ద్వారా ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేకుండా నేరుగా వివిధ ఆన్‌లైన్ సేవలను పొందేందుకు సభ్యుడిని అనుమతిస్తుంది.



యూఏఎన్ తెలుసుకోవడం ఇలా
- ముందుగా ఏకీకృత సభ్యుల పోర్టల్‌ని సందర్శించాలి.
- ఈపీఎఫ్‌ఓ రికార్డుల ప్రకారం మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
- “గెట్ ఆథరైజేషన్ పిన్” ఎంపికపై క్లిక్ చేయండి.
- ఈపీఎఫ్‌ఓలో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌కు పిన్ వస్తుంది. అనంతరం వచ్చిన పిన్‌ను నమోదు చేయాలి.
- ఈపీఎఫ్‌ఓ రికార్డుల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.
- అలాగే ఆధార్, పాన్, మెంబర్ ఐడిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని, వివరాలను అందించి, ఆపై “నా యూఏఎన్‌ని చూపు” క్లిక్ చేస్తే మీ యూఏఎన్ కనిపిస్తుంది.
- యూఏఎన్‌ని ఒక్కసారి మాత్రమే యాక్టివేట్ చేయాలి. మీరు ఉద్యోగాలు మారిన ప్రతిసారీ దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు.
- అలాగే మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా యూఏఎన్‌ను యాక్టివేట్ చేయలేరు. అయితే, మీరు ఉమంగ్ యాప్ ద్వారా యూఏఎన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




