UAN Pan Link: పర్మినెంట్ అకౌంట్ నెంబర్.. యూనివర్శల్ అకౌంట్ నంబర్.. వీటిని ఎవరు జారీ చేస్తారు? రెండింటికీ ప్రధాన తేడా ఇదే..

ఈపీఎఫ్ఓ ప్రకారం మీరు మీ పాన్ నంబర్‌ను యూనివర్శల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో లింక్ చేస్తే మీరు ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి సభ్యుడికి ఒకే శాశ్వత యూఏఎన్ కేటాయిస్తారు. ఇది వారి జీవితకాల సేవలో ప్రయోజనాలను పొందడం కోసం ఉపయోగించవచ్చు.

UAN Pan Link: పర్మినెంట్ అకౌంట్ నెంబర్.. యూనివర్శల్ అకౌంట్ నంబర్.. వీటిని ఎవరు జారీ చేస్తారు? రెండింటికీ ప్రధాన తేడా ఇదే..
Epfo
Follow us
Srinu

|

Updated on: Jul 12, 2023 | 6:30 AM

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈపీఎఫ్ఓ ప్రకారం మీరు మీ పాన్ నంబర్‌ను యూనివర్శల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో లింక్ చేస్తే మీరు ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి సభ్యుడికి ఒకే శాశ్వత యూఏఎన్ కేటాయిస్తారు. ఇది వారి జీవితకాల సేవలో ప్రయోజనాలను పొందడం కోసం ఉపయోగించవచ్చు. సభ్యులు తమ యూఏఎన్‌ను మొబైల్ నంబర్‌తో యాక్టివేట్ చేయాలి. అలాగే తప్పనిసరిగా కేవైసీను సీడింగ్ చేయాలి. అంటే ఆధార్, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నంబర్, పాన్ నెంబర్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా సంబంధిత యూఏఎన్‌తో లింక్ చేయాలి.

పాన్, యూఏఎన్ మధ్య వ్యత్యాసం ఇదే

పాన్, యూఏఎన్ రెండు వేర్వేరు గుర్తింపు సంఖ్యలు. పాన్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. అయితే  యూఏఎన్‌ను ఈపీఎఫ్ఓ ద్వారా జారీ చేస్తారు. పాన్ అనేది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. అయితే యూఏఎన్ 12 అంకెల సంఖ్య. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, బ్యాంక్ ఖాతాలను తెరవడం, ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడం వంటి వివిధ ప్రయోజనాల కోసం పాన్ ఉపయోగపడుతుంది. మీ ఈపీఎఫ్ ఖాతాను ట్రాక్ చేయడానికి, ఈపీఎఫ్ సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి యూఏఎన్ ఉపయోగపడుతుంది.

పాన్‌తో లింక్ చేయడం వల్ల ఉపయోగాలు

ఈపీఎఫ్ ఖాతాదారుని గుర్తింపు ధ్రువీకరించుకోవడానికి పాన్ నెంబర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఈపీఎఫ్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఈపీఎఫ్ఓకు ఖాతాదారుని పాన్ నంబర్ అవసరం. ఎందుకంటే ఖాతాదారుడి గుర్తింపుతో క్లెయిమ్ సరిగ్గా ప్రాసెస్ చేయడానికి పాన్ తప్పనిసరిా అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పన్ను ప్రయోజనాలు

ఈపీఎఫ్ ఖాతాదారు వారి పాన్‌ను వారి ఈపీఎఫ్ ఖాతాతో లింక్ చేయకపోతే పన్ను గణన కష్టం. ఎందుకంటే ఖాతాదారుడి గుర్తింపు, వారు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ధ్రువీకరించదు. మీరు ఈపీఎఫ్‌కు సహకరించే ఉద్యోగి అయితే మీ యూఏఎన్ నంబర్ తెలుసుకోవడం ముఖ్యం. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా లేదా మీ యజమానిని సంప్రదించడం ద్వారా మీరు మీ పే స్లిప్‌లో మీ  యూఏఎన్‌ నంబర్‌ను కనుగొనవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!