అవసరం ఏదైనా.. సులభంగా లోన్ పొందే మార్గం ఇదే.. ఎటువంటి పత్రాలు అవసరం లేదు..
Personal Loan: మీ అవసరం ఏదైనా అంటే హోమ్ రెన్నోవేషన్, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రయాణ ఖర్చులు ఇలా దేనికైనా మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు పర్సనల్ లోన్ అంటే ఏమిటి? దానిని ఎలా మంజూరు చేస్తారు? కావాల్సిన అర్హతలు ఏమిటి? వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఏమిటి చూద్దాం రండి..

అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యాయి. ఇంట్లో గోల్డ్ లేదు.. మీ పేరుమీద ఎటువంటి భూములు కూడా లేవు. ఆ సమయంలో మీకున్న ఏకైన ఆప్షన్ పర్సనల్ లోన్. ఈ లోన్ బ్యాంకులు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే సులభంగా మంజూరు చేస్తాయి. ఈ లోన్లను అసురక్షిత లోన్లు అని పిలుస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపనీలు(ఎన్బీఎఫ్సీలు) కూడా మంజూరు చేస్తాయి. మీ అవసరం ఏదైనా అంటే హోమ్ రెన్నోవేషన్, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రయాణ ఖర్చులు ఇలా దేనికైనా మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు పర్సనల్ లోన్ అంటే ఏమిటి? దానిని ఎలా మంజూరు చేస్తారు? కావాల్సిన అర్హతలు ఏమిటి? వడ్డీ రేటు ఎలా ఉంటుంది? అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఏమిటి చూద్దాం రండి..
పర్సనల్ లోన్..
బ్యాంకులు అసురక్షిత లోన్లుగా వీటిని పరిగణిస్తాయి. ఎటువంటి కాగితాలు అవసరం లేకుండా కేవలం మీ క్రెడిట్ రిపోర్టు ఆధారంగా లోన్లు మంజూరు చేస్తాయి. అయితే ఇతర హోం లోన్, గోల్డ్ లోన్లతో పోల్చితే వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అది కూడా వ్యక్తి సిబిల్ స్కోర్, జీతం, వయసు ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకు ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
చవకైన పర్సనల్ లోన్లు..
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 20 లక్షల వరకూ పర్సనల్ లోన్ కింద ఇస్తుంది. 84 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రేటు మారుతుంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా రూ. 20 లక్షల వరకూ పర్సనల్ లోన్ కింద ఇస్తుంది. 84 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు 10.25 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రేటు మారుతుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల వరకూ పర్సనల్ లోన్ కింద ఇస్తుంది. 60 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు 10. 40 శాతం నుంచి 16.95 వరకూ ఉంటుంది. వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రేటులో హెచ్చుతగ్గులుంటాయి.
- యాక్సిస్ బ్యాంక్ రూ. 5 లక్షల నుంచి రూ. 40లక్షల వరకూ పర్సనల్ లోన్ కింద ఇస్తుంది. 60 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు 10.49 శాతం నుంచి 22.00 శాతం వరకూ ఉంటుంది. వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రేటు మారుతుంది.
- హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ రూ. 40 లక్షల వరకూ పర్సనల్ లోన్ కింద ఇస్తుంది. 12 నుంచి 60 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 24శాతం వరకూ ఉంటుంది. వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రేటు మారుతుంది.
పర్సనల్ లోన్ పై అదనపు చార్జీలు.. చాలా బ్యాంకులు సర్వీస్ చార్జీల పేరిట పర్సనల్ లోన్ పై కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. వాటిల్లో ప్రధానంగా ప్రాసెసింగ్ ఫీజులు, వెరిఫికేషన్ చార్జీలు, డూప్లికేట్ స్టేట్ మెంట్ ఫీజులు, ఈఎంఐ మిస అయితే పెనాల్టీల ఫీజులు ఉంటాయి.
ప్రీ పేమెంట్ లేదా ముందుగా క్లోజ్ చేస్తే.. ఈ పర్సనల్ లోన్ మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధిలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ముందుగా లోన్ ను క్లోజ్ చేయాలంటే బ్యాంకులు అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజులు రెండు నుంచి 4శాతం వరకూ ఉంటాయి.
పర్సనల్ లోన్ టెన్యూర్.. సాధారణంగా పర్సనల్ లోన్ టెన్యూర్ 12 నుంచి 60 నెలల మధ్యలో ఉంటుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని బట్టి ఇది మారుతుంటుంది.
ఈఎంఐ చెల్లింపు.. మీరు తీసుకున్న పర్సనల్ లోన్ పై ప్రతి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఈఎంఐలో కొంత అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి ఉంటుంది. వడ్డీ రేటు, మీరు నిర్ణయించుకున్న కాల వ్యవధి, తీసుకున్న మొత్తం వంటి అంశాల ఆధారంగా మీరు చెల్లించాల్సిన ఈఎంఐని బ్యాంకులుల నిర్ణయిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







