FD Interest Rates: ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే బెస్ట్..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కళ్లు చెదిరే వడ్డీని రేటును అందిస్తాయి. గరిష్టంగా 9% వరకూ వడ్డీ రేట్లు పొందవచ్చు. ఒకవేళ మీరు పెట్టే పెట్టుబడిపై అధిక వడ్డీ రావాలని కోరుకుంటే మాత్రం వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. వాటిల్లో ప్రయోజనాలు ఏంటి? నిబంధనలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి.

FD Interest Rates: ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే బెస్ట్..
Fd Scheme
Follow us

|

Updated on: May 01, 2024 | 6:24 AM

ఏదైనా సురక్షిత పెట్టుబడి పథకం గురించి చెప్పమంటే ఎవరైనా టక్కున చెప్పే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). దీనిలో స్థిరమైన వడ్డీతో కచ్చితమైన రాబడి వస్తుంది. అందుకే ఇవి అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. సాధారణంగా వీటిని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో ఈ పథకాలు ఉంటాయి. అయితే వాటిల్లో కంటే అధిక వడ్డీని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కళ్లు చెదిరే వడ్డీని రేటును అందిస్తాయి. గరిష్టంగా 9% వరకూ వడ్డీ రేట్లు పొందవచ్చు. ఒకవేళ మీరు పెట్టే పెట్టుబడిపై అధిక వడ్డీ రావాలని కోరుకుంటే మాత్రం వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. వాటిల్లో ప్రయోజనాలు ఏంటి? నిబంధనలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి. ఈ కథనం మార్కెట్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

ఎఫ్డీలపై అధిక వడ్డీనిచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్లపై పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మంచి వడ్డీ రేటును అందిస్తాయి. గరిష్టంగా 9శాతం వరకూ వడ్డీని అందిస్తాయి. అయితే ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై మాత్రమే అందుతాయ. ఈ బ్యాంకుల జాబితా ఇది.

  • యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దీనిలో 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 9% వడ్డీ రేటు వస్తుంది.
  • సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంకు రెండు సంవత్సరాల రెండు రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.65% వరకూ వడ్డీ రేటును అందిస్తుంది.
  • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఇక్కడ 15 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.5% వడ్డీ రేటును లభిస్తుంది.
  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దీనిలో 365 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.5% వడ్డీ రేటు వస్తుంది.
  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దీనిలో 444 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.5% వడ్డీ రేటును పొందుతారు.
  • ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.5% వడ్డీ రేటును లభిస్తుంది.
  • ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దీనిలో రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8.25% వడ్డీ రేటును అందస్తుంది.
  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఇక్కడ 18 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 8% వడ్డీ రేటు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వ్యాయామం చేసే సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతులు
వ్యాయామం చేసే సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే పద్ధతులు
లేట్ నైట్ తినే అలవాటు ఉందా.. నష్టాలు ఏమిటో తెలుసా..
లేట్ నైట్ తినే అలవాటు ఉందా.. నష్టాలు ఏమిటో తెలుసా..
రెండేళ్లుగా ప్రియుడితో లివ్-ఇన్‌లో ఉన్న యువతి.. సీక్రెట్‌గా.!
రెండేళ్లుగా ప్రియుడితో లివ్-ఇన్‌లో ఉన్న యువతి.. సీక్రెట్‌గా.!
ఎండాకాలం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?నిపుణులు ఏం చెబుతున్నారు
ఎండాకాలం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?నిపుణులు ఏం చెబుతున్నారు
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్?
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
రోడ్డు పక్కన దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్..
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలో విశాల్ రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. విచిత్రమైన రూల్స్‌
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
స్పెయిన్ వీధుల్లో శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..