Telangana: ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట.! ఎవ్వరికీ తెలియని నిజాలు
అడిషినల్ డీసీపీ పి. సత్యనారాయణ తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బషీరాబాద్‌లో మూఢనమ్మకాలు, చేతబడి పేరుతో హింస, 1994 ఎన్నికల్లో టీ.ఎన్. శేషన్ తెచ్చిన సంస్కరణలు, పోలీస్ శాఖకు లభించిన అధికారం లాంటి కీలక అనుభవాలను ఆయన వివరించారు.

అడిషినల్ డీసీపీ పి. సత్యనారాయణ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన పలు కీలక సంఘటనలు, సవాళ్లను వివరించారు. ప్రధానంగా తాండూరు, బషీరాబాద్ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి ఆయన అనుభవాలను పంచుకున్నారు. తాండూరులోని కరన్ కోట గ్రామంలో జరిగిన ఒక హత్య కేసు గురించి ఆయన ఇలా అన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలతో ఈ హత్య జరిగిందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ చేసే అమానుషమైన పనుల ప్రస్తావిస్తూ.. ఆ రోజుల్లో అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయిలతో ఫస్ట్ నైట్‌కు సంబంధించి అతను నిబంధనలు డిక్టేట్ చేసే స్థాయికి వెళ్లేవాడని.. ఆ నిందితుడు తనకు ఎదురయ్యాడని.. ఓ ఊరికి ఆ నిందితుడు, అతడి బ్రదర్స్ నిబంధనలు డిక్టేట్ చేసేవారని చెప్పారు. ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలి అనేంతగా కంప్లైంట్స్ గ్రావిటీ అప్పుడు పెరిగాయని అన్నారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల అక్కడివారు, ఇక్కడివారు పటేల్ పట్వారీలుగా ఉండి, సరిహద్దు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడేవారని వివరించారు.
అంతేకాకుండా బషీరాబాద్‌లో పనిచేసిన సమయంలో ఎదురైన విచిత్రమైన, సవాలుతో కూడిన పరిస్థితులను సత్యనారాయణ గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాంతంలో పేదరికం, విద్యలేమి కారణంగా మూఢనమ్మకాలు విపరీతంగా ఉండేవని, సాధారణ ప్రజల నుంచి వారు విడిగా ఉన్నట్టు అనిపించేదని చెప్పారు. ఒకసారి చేతబడి చేశారనే నెపంతో కొందరిని బంధించగా, వారిని విడిపించేందుకు వెళ్ళిన ఆయనకు ఊహించని సంఘటన ఎదురైంది. సుమారు 300 మంది గుమిగూడగా, వారిలో 200 మంది హిస్టీరియా పట్టిన వారిలా కిందపడి కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితి నుండి బాధితులను రక్షించడానికి పోలీసు బృందం జీపులో వారిని ఎక్కించుకొని వచ్చినట్టుగా వివరించారు. వికారాబాద్ ప్రాంతంలో అధిక ఆత్మహత్యల ధోరణులు ఉండేవని, ఇది పేదరికం, విద్యాలోపం, మూఢనమ్మకాల పదేపదే చర్చల వల్ల ఏర్పడిన మానసిక స్థితి అని ఆయన విశ్లేషించారు. ఈ ఘటనల తర్వాత, అప్పటి ఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
