Car Loan Rates: కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..

కారు కొనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ వడ్డీ రేటుపై కారు లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో తక్కువ వడ్డీకే కార్ లోన్లు అందిస్తున్న బ్యాంకుల వివరాలను మీకు అందిస్తున్నాం. వాస్తవానికి ఇటీవల కాలంలో కార్ల రేట్లు కాస్త పెరిగాయి. అది వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కార్ లోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

Car Loan Rates: కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
Car Loan
Follow us
Madhu

|

Updated on: Jul 19, 2024 | 4:08 PM

కారు కొనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ వడ్డీ రేటుపై కారు లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో తక్కువ వడ్డీకే కార్ లోన్లు అందిస్తున్న బ్యాంకుల వివరాలను మీకు అందిస్తున్నాం. వాస్తవానికి ఇటీవల కాలంలో కార్ల రేట్లు కాస్త పెరిగాయి. అది వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కార్ లోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు తప్పనిసరిగా వడ్డీ రేట్ల గురించి ఆలోచించాలి. ఈఎంఐ భారం లేకుండా చూసుకోవాలి. కాల వ్యవధిని అందుకు అనుగుణంగా ఉంచుకోవాలి. అందుకోసం మార్కెట్లో కార్ లోన్ వడ్డీ రేట్లపై ఆరా తీయాలి. అలాగే ప్రాసెసింగ్ చార్జీలు, అదనపు చార్జీల వివరాలు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న కార్ లోన్లు, వాటిపై వడ్డీ రేట్లు, చార్జీలు వివరాలను మీకు అందిస్తున్నాం.

కార్ లోన్ రేట్లు, చార్జీలు..

  • యూకో బ్యాంక్ కార్ లోన్లను 8.45 శాతం నుంచి 10.55 శాతం వడ్డీ రేట్లపై అందిస్తోంది. 5 సంవత్సరాల కాల వ్యవధిలో రూ. 5 లక్షల లోన్ మొత్తానికి రూ. 10,246 నుంచి రూ. 10,759 మధ్య ఈఎంఐలకు అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్ ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయదు.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్లపై 8.70 శాతం నుంచి 10.45 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి రూ. 10,307 నుంచి రూ. 10,735 వరకు ఈఎంఐ పడుతుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000గా ఉంది.
  • కెనరా బ్యాంక్లో కార్ లోన్లను 8.70 శాతం నుంచి 12.70 శాతం వడ్డీ రేటుకు అందిస్తోంది. దీని ఫలితంగా ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల రుణం మొత్తంపై రూ. 10,307, రూ. 11,300 మధ్య ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25 శాతం, గరిష్టంగా రూ. 2,500 ఉంటుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కార్ లోన్లను 8.75 శాతం నుంచి 10.60 శాతం వరకు వడ్డీ రేట్లకు అందిస్తోంది. ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల లోన్ మొత్తానికి రూ. 10,319 నుంచి రూ. 10,772 మధ్య ఈఎంఐ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 0.25 శాతం, రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్లను 8.90 శాతం నుంచి 12.70 శాతం వరకు వడ్డీ రేటుకు అందిస్తోంది. ఫలితంగా ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి రూ. 10,355 నుంచి రూ. 11,300 మధ్య ఈఎంఐ పడుతుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు రూ.2,000 వరకు ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్లపై 8.85 శాతం నుంచి 10.85 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల రుణ మొత్తానికి ఈఎంఐ రూ. 10,343 నుంచి రూ. 10,834 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ రుసుము రుణం మొత్తంలో 0.25 శాతం, రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు ఉంటుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ లోన్లపై వడ్డీ రేటు 8.95 శాతం నుంచి 10.00 శాతం వరకు ఉంటుంది. ఫలితంగా ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల లోన్ మొత్తానికి ఈఎంఐ రూ. 10,367 నుంచి రూ. 10,624 మధ్య ఉంటుంది. ఈ బ్యాంక్ లో ప్రాసెసింగ్ ఫీజు రూ.1,500 వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..