LPG Cylinder: సామాన్యుల్లో కలవరం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరగనుందా..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోన్న సమయంలో మార్చి 1న ఎల్‌పీజీ(LPG) సిలిండర్ల ధర వివరాలు విడుదల చేయనున్నారు..

LPG Cylinder: సామాన్యుల్లో కలవరం.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరగనుందా..!
Gas Cylinder
Follow us

|

Updated on: Feb 28, 2022 | 3:35 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోన్న సమయంలో మార్చి 1న ఎల్‌పీజీ(LPG) సిలిండర్ల ధర వివరాలు విడుదల చేయనున్నారు. 6 అక్టోబర్ 2021 తర్వాత, దేశీయ LPG సిలిండర్ ధర మరి తగ్గలేదు, భారీగా పెరగలేదు. అయితే ప్రస్తుతం ముడి చమురు(Crude oil) ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు పైగా ఉంది. అదే సమయంలో వాణిజ్య సిలిండర్ల(Non subsidy cylinder) ధరలలో భారీ మార్పు వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం నాన్-సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించారు. మరోవైపు, ముడి చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లు దాటినప్పటికీ, అక్టోబర్ 6, 2021 నుంచి దేశీయ LPG సిలిండర్‌ల ధరలో ఎటువంటి మార్పు లేదు.

కానీ ఎన్నికల తర్వాత అంటే మార్చి 7 తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్‌ ధర రూ. 100 నుంచి 200 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 2021 నుంచి ఫిబ్రవరి 1, 2022 మధ్య ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అక్టోబర్ 1న వాణిజ్య సిలిండర్ ధర రూ.170 పెరిగి రూ.1736గా చేరుకుంది. గత నవంబర్‌లో రూ. 2000గా, డిసెంబర్‌లో రూ.2101లకు పెరిగింది. దీంతో జనవరి నెలలో ధరను 2022 ఫిబ్రవరిలో వాణిజ్య సిలిండర్ ధరరూ.1907కి చేరింది. అదే సమయంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరు చూసినట్లైతే 14.2 కిలోల సిలిండర్‌ ఢిల్లీ-ముంబైలో దాదాపు రూ.900, కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.916, హైదరాబాద్‌లో రూ. 910 లుగా ఉంది.

Read Also.. EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..