Home Loan: గృహ రుణాలపై ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు.. పైగా బోలెడన్ని లాభాలు

గృహ రుణం అందుబాటులో ఉన్న చౌకైన రుణాల్లో ఒకటి. సాధారణంగా ఇంటిని కొనుగోలు చేసే వారికి గృహ రుణాలు ఏకైక మార్గంగా ఉంటాయి. గృహ రుణాన్ని చాలా మంది గుడ్‌ లోన్‌ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా మెచ్చుకోగలిగే స్పష్టమైన ఆస్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది. హౌసింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చాలా సంవత్సరాలుగా జాప్యం లేదా ఆగిపోతున్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని ఆర్థిక సలహాదారులు అంటున్నారు.

Home Loan: గృహ రుణాలపై ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేట్లు.. పైగా బోలెడన్ని లాభాలు
Bank Home Loan
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2023 | 10:11 PM

గృహ రుణం అంటేనే రుణాల విషయలో అధికంగా తీసుకునే రుణం. లోన్ మొత్తం పరంగా మాత్రమే కాకుండా పదవీకాలం 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.  అంత పదవీ కాలం కారణంగా తీసుకున్న అప్పు ఎంత ఉందో? అంతే స్థాయిలో దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గృహ రుణం అందుబాటులో ఉన్న చౌకైన రుణాల్లో ఒకటి. సాధారణంగా ఇంటిని కొనుగోలు చేసే వారికి గృహ రుణాలు ఏకైక మార్గంగా ఉంటాయి. గృహ రుణాన్ని చాలా మంది గుడ్‌ లోన్‌ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా మెచ్చుకోగలిగే స్పష్టమైన ఆస్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది. హౌసింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చాలా సంవత్సరాలుగా జాప్యం లేదా ఆగిపోతున్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని ఆర్థిక సలహాదారులు అంటున్నారు. కాబట్టి ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయో? అలాగే ఏయే బ్యాంకుల్లో ప్రాసెసింగ్‌ ఫీజులు తక్కువ ఉన్నాయో? ఓ సారి చూద్దాం.

సాధారణంగా మన అవసరాన్ని బట్టి ఓ రూ.30 లక్షల రుణాన్ని 20 ఏళ్ల టెన్యూర్‌తో తీసుకుంటే ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో? పైగా వాటి ఈఎంఐ రేటు ఎంత ఉంటుందో? ఓసారి చూద్దాం.

ఇవి కూడా చదవండి
  • బ్యాంకు ఆఫ్‌ ఇండియా మన క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి 8.30 శాతం నుంచి 10.75 శాతం వడ్డీను వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.25,656 నుంచి రూ.30,457 వరకూ ఉంటుంది. అలాగే డిసెంబర్‌ 31 వరకూ ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తున్నారు.
  • బ్యాంకు ఆఫ్‌ బరోడ మన క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి 8.40 శాతం నుంచి 10.60 శాతం వడ్డీను వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.25,845 నుంచి రూ.30,153 వరకూ ఉంటుంది. అలాగే ఈ బ్యాంకులో ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తున్నా రూ.10,000 + జీఎస్టీ మాత్రం పాకెట్‌ ఎక్స్‌పెన్సెస్‌ కింద వసూలు చేస్తున్నారు.
  • కెనరా బ్యాంక్‌ 8.40 శాతం నుంచి 11.25 శాతం వడ్డీను వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.25,845 నుంచి రూ.31,478 వరకూ ఉంటుంది. అలాగే రిటైల్‌ లోన్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌లో భాగంగా ఈ బ్యాంకు కూడా డిసెంబర్‌ 31 వరకూ ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తున్నారు.
  • ఇండియన్‌ బ్యాంకు మన క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి 8.40 శాతం నుంచి 10.20 శాతం వడ్డీను వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.25,845 నుంచి రూ.29,349 వరకూ ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్‌ ఫీజు 0.25 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. 
  • ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 8.40 శాతం నుంచి 9.55 శాతం వడ్డీను వసూలు చేస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ.25,845 నుంచి రూ.28,062 వరకూ ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్‌ ఫీజు 0.50 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. అలాగే గరిష్టంగా ప్రాసెసింగ్‌ ఫీజులు రూ.25,000 + జీఎస్టీ ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?