AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank loans: రుణాలకు పెరుగుతున్న డిమాండ్..ఆ లోన్ల మధ్య తేడాలివే.. !

ఆధునిక కాలంలో విద్యకు ఎంతో ప్రాధాన్యం పెరిగింది. బాగా చదువుకుని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని యువత కలలు కంటోంది. దానికి అనుగుణంగానే కష్టబడి చదువుతూ విజయతీరాలకు చేరుకుంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే మన దేశంతో పాటు విదేశాల్లో అనేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే చదువుపై కేవలం ఆసక్తి ఉంటే సరిపోదు, ఆయా కోర్సులు చదవటానికి డబ్బు చాలా అవసరం. దీని కోసం చాలామంది బ్యాంకులను ఆశ్రయిస్తారు.

Bank loans: రుణాలకు పెరుగుతున్న డిమాండ్..ఆ లోన్ల మధ్య తేడాలివే.. !
Laons
Nikhil
|

Updated on: Jun 24, 2025 | 2:56 PM

Share

సాధారణంగా బ్యాంకుల వద్ద విద్యారుణం తీసుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తారు. మరికొందరు ‍వ్యక్తిగత రుణాలను తీసుకుని, వాటిని చదువుకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల రుణాల మధ్య తేడాలేమిటి, రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యా రుణాలను చదువుకోవటానికి మాత్రమే మంజూరు చేస్తారు. వీటిని ఉపయోగించుకుని మన దేశంతో పాటు విదేశాల్లో కూడా చదువు కోవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో పాటు రుణం తీర్చడానికి ఎక్కువ సమయం ఉంటుంది. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత, ఉద్యోగం చేరిన అనంతరం విద్యా రుణాన్ని చెల్లించడం మొదలుపెట్టవచ్చు. అయితే బ్యాంకుల నుంచి విద్యారుణం పొందటానికి వివిధ పత్రాలు చాలా అవసరం. అడ్మిషన్‌ నిర్దారణ, కోర్సు ఫీజు షెడ్యూల్‌ తదితర సమగ్రమైన డాక్యుమెంట్ల సమర్పించాలి. అన్నిపత్రాలను పరిశీలించిన తర్వాతనే రుణం మంజూరు చేస్తారు.

పర్సనల్‌ రుణాలను వ్యక్తిగత ఖర్చులు, అవసరాల కోసం తీసుకుంటారు. వివాహం, ఇంటి నిర్మాణం, చదువు, వైద్యం.. ఇలా అన్ని అవసరాలకూ వీటిని వాడుకోవచ్చు. వ్యక్తిగత రుణాలను బ్యాంకులు త్వరగానే మంజూరు చేస్తాయి. కానీ వీటికి వడ్డీరేటు ఎక్కువ. మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే ఒక్క రోజు లోనే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణ వాయిదాలు చెల్లింపులకు సమయం ఉండదు. రుణం తీసుకున్న తర్వాత నెల నుంచే ఈఎంఐల రూపంలో కట్టడం ప్రారంభించాలి.

విద్యారుణాలు, వ్యక్తిగత రుణాల మధ్య తేడా ఏమిటంటే వాటి వడ్డీరేటు, చెల్లించే కాలపరిమితి అని చెప్పవచ్చు. విద్యారుణాలను సుమారు 15 ఏళ్ల వరకూ తక్కువ వడ్డీతో చెల్లించే అవకాశం ఉంటుంది. నెలవారీ వాయిదాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరో వైపు వ్యక్తిగత రుణాలకు వడ్డీరేటు ఎక్కువ. సుమారు ఐదేళ్ల వరకూ మాత్రమే కాలవ్యవధి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్‌ 80ఈ ప్రకారం.. విద్యా రుణాలపై చెల్లించే వడ్డీకి మినహాయింపు లభిస్తుంది. అప్పు చెల్లించడం ప్రారంభించిన రోజు నుంచి ఎనిమిదేళ్ల వరకూ ఈ అవకాశం ఉంటుంది. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి వాయిదాలు కట్టడం ప్రారంభించవచ్చు. కానీ వ్యక్తిగత రుణాల విషయంలో ఈ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం విద్యారుణాలే ఉపయోగంగా ఉంటాయి. అయితే తక్కువ ఖర్చు గల కోర్సులు చేసే వారు వ్యక్తిగత రుణాలను వినియోగించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి