Smartphone Market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల హవా.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా టాప్ కంపెనీలు రిలీజ్ చేసే ప్రిమియం స్మార్ట్ ఫోన్లను యువత ఎక్కువగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ దాదాపు 50 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Smartphone Market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల హవా.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు
Smartphone Market
Follow us
Srinu

|

Updated on: Jan 04, 2025 | 3:04 PM

యాపిల్, శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణాన్ని 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,28,900 కోట్లు) పెంచుతుందని ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ఇటీవల పేర్కొంది. ఈ సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పరిమాణం 37.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.25 ట్రిలియన్లు)గా అంచనా వేశారు. భారతదేశానికి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025లో అత్యధికంగా 50 బిలియన్ డాలర్లను చేరుకునే దిశగా అడుగులు వేస్తుందని పేర్కొంటున్నారు. యాపిల్, సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లు ప్రీమియం, అల్ట్రా-ప్రీమియం విభాగాల్లో కొత్త ఫోన్ల ఎంట్రీతో ఈ స్థాయిలో వృద్ధి నమోదువుతుందని చెబుతున్నారు. 

2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా మొత్తం ఆదాయాన్ని రూ. 67,121.6 కోట్లుగా నమోదు చేయగా, సామ్‌సంగ్ మొబైల్ ఫోన్ వర్టికల్ ద్వారా రూ. 71,157.6 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నివేదిక ప్రకారం భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రిటైల్ సగటు విక్రయ ధర 2025లో మొదటిసారిగా 300 డాలర్ల మార్క్ (సుమారు రూ. 25,700) దాటుతుందని అంచనా. యాపిల్ తన ఐఫోన్ లైనప్‌లో భారతదేశ తయారీతో పాటు ఇటీవలి ధరల తగ్గింపుల కారణంగా దాని ప్రో మోడల్స్‌కు డిమాం్ పెరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సామ్‌సంగ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎస్ సిరీస్‌ డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే వివో, అప్పో, వన్ ప్లస్ వంటి చైనీస్ బ్రాండ్‌లు సరసమైన ప్రీమియం కేటగిరీలో అధునాతన కెమెరా సిస్టమ్‌లు మొదలైనవాటిని అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోన్ల ధరలు రూ. 30,000 నుంచి రూ.45,000 మధ్య ఉంటాయి.

2024 సంవత్సరం ప్రారంభంలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిన డిస్‌ప్లే, మదర్‌బోర్డుకు సంబంధించిన భారతీయ కస్టమర్ల ఆందోళనలను పరిష్కరించేలా నూతన ఫోన్లన లాంచ్ చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక మార్కెట్ విస్తరణలో కంపెనీ 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ప్రీమియం సెగ్మెంట్ (రూ. 30,000 కంటే ఎక్కువ) 2025 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుకు వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్‌లను వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత ఫీచర్‌లపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ప్రీమియం ఫోన్లను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్