పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. టాప్ 10లో తెలంగాణ

జూన్ నెలలలో తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు మెరుగుపడ్డాయి. గత ఏడాది జూన్ తో పోల్చితే రాష్టాల ఖజానాకు చేరిన వసూళ్లు కేవలం 3 శాతం మాత్రమే తగ్గిందని తేలింది. గత ఏడాది జూన్‌లో అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.77,083 కోట్లు జీఎస్టీ , ఈసారి అది రూ.74,602 కోట్లకు చేరిందని అధికారిక లెక్కలు చెబతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సానుకూల వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈసారి తెలంగాణలో 3శాతం… ఆంధ్రప్రదేశ్‌లో 6శాతం పన్ను వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది. ఇదిలావుంటే.. […]

పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. టాప్ 10లో తెలంగాణ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 5:19 AM

జూన్ నెలలలో తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు మెరుగుపడ్డాయి. గత ఏడాది జూన్ తో పోల్చితే రాష్టాల ఖజానాకు చేరిన వసూళ్లు కేవలం 3 శాతం మాత్రమే తగ్గిందని తేలింది. గత ఏడాది జూన్‌లో అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.77,083 కోట్లు జీఎస్టీ , ఈసారి అది రూ.74,602 కోట్లకు చేరిందని అధికారిక లెక్కలు చెబతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సానుకూల వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈసారి తెలంగాణలో 3శాతం… ఆంధ్రప్రదేశ్‌లో 6శాతం పన్ను వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది.

ఇదిలావుంటే.. వస్తు సేవల పన్ను వసూళ్లపై లాక్‌డౌన్ ప్రభావం కనిపించింది. జూన్‌లో రూ.90,917 కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే 9 శాతం, మేతో పోలిస్తే 62 శాతం, ఏప్రిల్‌తో పోలిస్తే 28 శాతం చొప్పున వసూళ్లు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్‌టీ వసూళ్లు 59 శాతం క్షీణించాయి.