ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ రాజీనామా

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం రాజీనామా చేశారు. 2015 నవంబరు లో ఆయన ఈ పదవిని చేపట్టారు. ఇవాళ సమావేశమైన ఐసీసీ బోర్డు..

ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ రాజీనామా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 7:16 PM

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగిసింది. ఆయన బుధవారం రాజీనామా చేశారు. 2015 నవంబరు లో ఆయన ఈ పదవిని చేపట్టారు. ఇవాళ సమావేశమైన ఐసీసీ బోర్డు.. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ను తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు  స్వీకరించాలని కోరుతూ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించింది. కొత్త వ్యక్తిని ఎన్నుకునేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. శశాంక మనోహర్ మరో రెండేళ్లు పదవిలో కొనసాగవలసి ఉంది. గతంలో-2008నుంచి 2011 వరకు ఆయన బీసీసీఐ చైర్మన్ గా వ్యవహరించారు. కాగా- ఐసీసీ కొత్త చైర్మన్ ఎన్నికకు ప్రక్రియను ఐసీసీ బోర్డు వచ్ఛే వారం చేపట్టి ఆమోదించవలసి ఉంది.