Tecno Phantom X2 Pro 5G: ప్రారంభమైన టెక్నో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్.. ఫీచర్స్, ధర తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెట్టాల్సిందే..!

|

Jan 18, 2023 | 10:19 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Tecno తన కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా మర్కెట్‌లోకి వచ్చిన Tecno Phantom X2 Pro 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్..

Tecno Phantom X2 Pro 5G: ప్రారంభమైన టెక్నో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్.. ఫీచర్స్, ధర తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెట్టాల్సిందే..!
Tecno Phantom X2 Pro 5g
Follow us on

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Tecno తన కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తాజాగా మర్కెట్‌లోకి వచ్చిన Tecno Phantom X2 Pro 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ నేడు(జనవరి 18) నుంచి అమెజాన్‌లో ప్రారంభమవుతాయి. ఇంతక ముందు వచ్చిన Phantom X2 స్మార్ట్‌ఫోన్ మోడల్ సిరీస్‌లోనే వస్తున్న Phantom X2 Pro దానికంటే మెరుగైన ఫీచర్లు, లుక్‌తో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగిన ఈ ఫోన్‌ను Tecno  కంపెనీ తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Tecno Phantom X2 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే: Tecno Phantom X2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల ఫుల్లీ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్న ఈ ఫోన్‌లో భద్రత కోసం Tecno కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని ఉపయోగించింది.

 ప్రాసెసర్: స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం Tecno కంపెనీ Tecno Phantom X2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 4nm ఆధారంగా MediaTek Dimensity 900 చిప్‌సెట్‌ని అమర్చింది.

ఇవి కూడా చదవండి

 మెరా సెటప్: ప్రపంచంలోనే మొట్టమొదటి 50MP కెమెరా సెన్సార్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది.  అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్‌ కూడా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. వెనుక కెమెరా 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదు.

బ్యాటరీ కెపాసిటీ: ఫోన్‌కు 5160 mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

భారత్‌లో Tecno Phantom X2 Pro 5G ధర:

భారత మార్కెట్‌లో ఈ Tecno Phantom X2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 49, 999గా  దాని కంపెనీ ప్రకటించింది. ఈ రోజు(జనవరి 18) నుంచే అమెజాన్‌లో టెక్నో ఫోన్ కస్టమర్ల కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమయింది. ఇంకా ఈ టెక్నో ఫోన్‌ను కొనుగోలు చేసినవారికి 12 నెలల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా అందుతుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం వడ్డీ లేని EMI కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..