TCS CEO: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సీఈఓ వేతనం రూ.20.36 కోట్లు: నివేదిక వెల్లడి

TCS CEO Rajesh Gopinathan: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సీఈఓ, ఎండీ రాజేష్‌ గోపీనాథ్‌ 2020-21లో రూ. 20.36 కోట్ల వేతనం తీసుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో.

TCS CEO: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సీఈఓ వేతనం రూ.20.36 కోట్లు: నివేదిక వెల్లడి
Tcs Ceo Rajesh Gopinathan

Updated on: May 21, 2021 | 7:07 PM

TCS CEO Rajesh Gopinathan: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) సీఈఓ, ఎండీ రాజేష్‌ గోపీనాథ్‌ 2020-21లో రూ. 20.36 కోట్ల వేతనం తీసుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. 2019-20లో ఆయన పారితోషకం రూ.13.3 కోట్లుగా ఉంది. అయితే కోవిడ్‌ సమయంలో కూడా ఇంత వేతనం అందుకోవడం గమనార్హం. టీసీఎస్‌ నివేదిక ప్రకారం.. 2020-21లో గోపీనాథ్‌ రూ.1.27 కోట్ల వేతనం రూపంలో, రూ.2.09 కోట్లు అలవెన్స్‌ల రూపంలో, రూ.17 కోట్లను కమీషన్‌గా అందుకున్నట్లు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (COO) ఎన్ గణపతి సుబ్రమణియం రూ.16 కోట్ల వేతనం అందుకున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. ఆయన వేతనం రూ.1.21 కోట్లుగా పేర్కొంది.

అయితే అలవెన్స్‌ల రూపంలో ఆయన రూ.1.88 కోట్లు, కమీషన్‌గా రూ.13 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఉన్నత స్థాయి అధికారుల వేతనం సగటున 55.22 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. గత వార్షిక సంవత్సరం భారత్‌లోని సంస్థ ఉద్యోగులు 6.4 శాతం (ఇతర అలవెన్సులతో కలిపి), విదేశాల్లోని సిబ్బంది 2-6 శాతం వరకు వేతనాల్లో పెంపును అందుకున్నట్లు తెలిపింది. 2021 మార్చి నాటికి మొత్తం 4,48,649 ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి:

AP CM: ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

Gautam Adani: బ్లూమ్‌బెర్గ్‌ జాబితా.. ఆసియాలోనే రెండో కుబేరుడు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ ఆదానీ..

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..