PPF Scheme: నెలకు రూ. 1000 పెట్టుబడితో.. రూ. 26 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..?

Money Making Tips: అసలే కరోనాకాలం.. ఆపై ఉంటుందో.. ఊడుతుందో.. అనుకునే ఉద్యోగాలు.. ఇలాంటి తరుణంలో డబ్బును...

PPF Scheme: నెలకు రూ. 1000 పెట్టుబడితో.. రూ. 26 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..?
Ppf
Follow us
Ravi Kiran

|

Updated on: May 21, 2021 | 6:23 PM

Money making tips: అసలే కరోనాకాలం.. ఆపై ఉంటుందో.. ఊడుతుందో.. అనుకునే ఉద్యోగాలు.. ఇలాంటి తరుణంలో డబ్బును పొదుపు చేయడం చాలా అవసరం. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పధకాలు, ఫండ్స్ వైపు చాలామంది దృష్టి సారిస్తుంటారు. అలాంటి పెట్టుబడి మార్గాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకం. 1968వ సంవత్సరంలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ పీపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న చిన్న పొదుపులను లాభదాయకమైన పెట్టుబడిగా మార్చడం ఈ స్కీం ప్రత్యేకత. మీరు ఈ స్కీం మెచ్యూరిటీ కాలాన్ని తెలివిగా ఎంచుకుంటే, దీర్ఘకాలిక పీపీఎఫ్ చాలా మంచి రాబడిని ఇస్తుంది.

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో నెలకు 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే, అధిక మొత్తంలో రాబడి వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రతీ సంవత్సరం కనీసం రూ .500 గరిష్టంగా రూ .1.5 లక్షలు వరకు పీపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత మీరు మీ మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా 5 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

పీపీఎఫ్‌లో 1000 రూపాయలు పెట్టుబడి పెడితే.. రూ .26 లక్షలు పొందొచ్చు..

1. 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి…

15 ఏళ్లుగా ప్రతి నెలా రూ .1,000 డిపాజిట్ చేస్తూ ఉంటే, మీరు రూ .1.80 లక్షలు జమ చేస్తారు. వడ్డీ 7.1 శాతాన్ని కలుపుకుని మెచ్యూరిటీ సమయానికి అంటే 15 సంవత్సరాల తరువాత రూ .3.25 లక్షలు లభిస్తాయి.

2. పీపీఎఫ్ ఖాతాను 5 సంవత్సరాలు పొడిగించండి..

ఇప్పుడు మీరు మీ పీపీఎఫ్‌ను 5 సంవత్సరాలు పొడిగిస్తే, ప్రతీ నెలా 1000 రూపాయల పెట్టుబడిని కొనసాగిస్తే, 5 సంవత్సరాల తరువాత, రూ .3.25 లక్షలు రూ .5.32 లక్షలవుతాయి.

3. పీపీఎఫ్ ఖాతాను రెండోసారి 5 సంవత్సరాల పాటు పొడిగించండి..

మరోసారి 5 సంవత్సరాలు మీ పీపీఎఫ్ ఖాతాను పొడిగించండి.. 1000 రూపాయల పెట్టుబడిని కొనసాగించండి, వచ్చే 5 సంవత్సరాల తరువాత, మీ పీపీఎఫ్ ఖాతాలోని డబ్బు రూ .8.24 లక్షలకు పెరుగుతుంది.

4. మూడోసారి ఐదు సంవత్సరాలు మీ ఖాతాను పొడిగించండి..

మీరు ఈ పీపీఎఫ్ ఖాతాను మూడవసారి, 5 సంవత్సరాలు పొడిగించి, రూ .1000 పెట్టుబడిని కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి కాలం 30 సంవత్సరాలు కాగా, పీపీఎఫ్ ఖాతాలోని మొత్తం రూ .12.36 లక్షలకు పెరుగుతుంది.

5. పీపీఎఫ్ ఖాతాను నాలుగోసారి 5 సంవత్సరాలు పొడిగించండి..

మీరు 30 సంవత్సరాల తరువాత మరో 5 సంవత్సరాల పాటు పీపీఎఫ్ ఖాతాను పొడిగించి.. నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే, మీ పీపీఎఫ్ ఖాతాలోని డబ్బు రూ .18.15 లక్షలకు పెరుగుతుంది.

6. పీపీఎఫ్ ఖాతాను ఐదవసారి 5 సంవత్సరాలు పొడిగించండి..

35 సంవత్సరాల తరువాత, మీరు పీపీఎఫ్ ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించి, నెలకు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే.. మీ ఖాతాలోని డబ్బు రూ .26.32 లక్షలకు పెరుగుతుంది.

ఈ విధంగా, మీరు 20 సంవత్సరాల వయస్సులో పీపీఎఫ్ స్కీంలో చేరి 1000 రూపాయల పెట్టుబడిని పెట్టడం ప్రారంభిస్తే.. పదవీ విరమణ సమయానికి రూ .26.32 లక్షలు పొందవచ్చు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!