Tax On Crypto Currency: క్రిప్టో కరెన్సీపై పన్ను బాదుడు షురూ.. ఎంత చెల్లించాలో? తెలిస్తే షాక్..!
2022 యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం అధికారికంగా క్రిప్టో ఆస్తులతో సహా డిజిటల్ ఆస్తులను వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా వర్గీకరించింది. క్రిప్టో మరియు ఎన్ఎఫ్‌టీలు (నాన్-ఫంగబుల్ టోకెన్లు) వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చే ఆదాయం 30 శాతం ఫ్లాట్ రేటుతో పన్ను విధిస్తారని చాలా మందికి తెలియదు. పన్ను రేటు అయితే కేవలం 30 శాతానికి పరిమితం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఛార్జీలు కూడా ఇందులో ఉంటాయని వివరిస్తున్నారు.

క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ అనే విషయం అందరికీ తెలిసిందే ఇది ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌లను ఉపయోగించి సృష్టించిన చెల్లింపునకు సంబంధించిన ప్రత్యామ్నాయ రూపంగా ఉంటుంది. 2022 యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం అధికారికంగా క్రిప్టో ఆస్తులతో సహా డిజిటల్ ఆస్తులను వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా వర్గీకరించింది. క్రిప్టో మరియు ఎన్ఎఫ్‌టీలు (నాన్-ఫంగబుల్ టోకెన్లు) వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చే ఆదాయం 30 శాతం ఫ్లాట్ రేటుతో పన్ను విధిస్తారని చాలా మందికి తెలియదు. పన్ను రేటు అయితే కేవలం 30 శాతానికి పరిమితం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఛార్జీలు కూడా ఇందులో ఉంటాయని వివరిస్తున్నారు. ఉదాహరణకు మీరు క్రిప్టోకరెన్సీ మొత్తాన్ని విక్రయించడం ద్వారా రూ. 1,000 లాభాన్ని ఆర్జిస్తే ఆపై 30 శాతం పన్ను తగ్గింపును పోస్ట్ చేస్తే మీకు పూర్తిగా రూ. 700 లభించదు. మీరు మీకు లభించిన లాభంపై 4 శాతం సెస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాబడికు సంబంధిచిన టీడీఎస్ 1 శాతం పన్ను తీసేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం పన్ను రేటును చేస్తుంది. అంటే మన రాబడిపై 35 శాతం పన్న చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై వచ్చే రాబడికి ఎంత శాతం పన్ను చెల్లించాలో? ఓ సారి తెలుసుకుందాం.
మీరు క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో రూ. 1,00,000 విలువైన షేర్లను విక్రయించారని అనుకుందాం. వివిధ సంస్థలు డిజిటల్ కరెన్సీలలో కొనుగోలు చేయడంతో పాటు విక్రయించడానికి క్రిప్టోకరెన్సీ మార్పిడి చేయడానికి పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. ఈ షేర్ల విక్రయం ద్వారా మీరు రూ. 50,000 లాభం పొందారని అనుకుంటే ఇప్పుడు రూ.50,000 బదులు రూ.32,500 మాత్రమే మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే రూ.50,000 లాభంపై 1 శాతం టీడీఎస్, ఫ్లాట్ రేట్ 30 శాతం పన్ను, 4 శాతం సెస్ చార్జీ విధిస్తారు. ఇప్పుడు లాభాలపై మీ మొత్తం పన్ను రేటు 35 శాతం అవుతుంది అంటే మీరు రూ. 50,000 లాభంపై రూ. 17,500 పన్ను చెల్లించాలి.
ఇటీ న్యూ ఢిల్లీకి చెందిన ఓ టెక్నాలజీ పాలసీ థింక్ ట్యాంక్ టీడీఎస్‌లో క్రిప్టో పన్ను విధానానికి సంబంధించి 1 శాతం పన్ను మినహాయించే ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. క్రిప్టోకరెన్సీపై టీడీఎస్ పన్నును 0.01 శాతానికి తగ్గించాలని టెక్నాలజీ పాలసీ థింక్ ట్యాంక్ ప్రతిపాదించింది. ఇండియన్ వర్చువల్ డిజిటల్ అసెట్ మార్కెట్‌పై మూలం వద్ద తగ్గించిన పన్ను ప్రభావం వంటి విషయాల్లో ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








