Janaushadhi Kendra: ఆరోగ్యంతో పాటు ఆదాయం మీ సొంతం.. మీ షాపు ఎక్కడ ఉన్నా అమ్మకాల జోరు షురూ..!
తంలో భారతదేశంలో ఆయుర్వేద మందులను రోగ నిరోధకత కోసం వాడేవు. క్రమేపి ఇంగ్లిష్ మందులను వాడడానికి ప్రజలు అలవాటు పడ్డారు. అయితే ఇంగ్లిష్ మందులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో సాధారణంగా అధిక ధరలు ఉంటాయి. ఈ ధరఘాతం నుంచి రక్షణ కేంద్ర ప్రభుత్వం జనౌషధి కేంద్రాలు పబ్లిక్ ఫార్మాస్యూటికల్ దుకాణాల ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ దుకాణాలు 2008లో భారత ప్రభుత్వంలోని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఔషధాల శాఖ ప్రారంభించారు. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) పేరుతో ఈ కేంద్రాలు ప్రచారంలో ఉన్నాయి.

భారతదేశంలో ఆరోగ్యమే పెద్ద వ్యాపారమని చాలా మందికి తెలియదు. అవును మీరు వింటున్నది నిజమే. భారతదేశం జనాభాపరంగా ముందు వరుసలో ఉందని చాలా మందికి తెలుసు. అందువల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ. గతంలో భారతదేశంలో ఆయుర్వేద మందులను రోగ నిరోధకత కోసం వాడేవు. క్రమేపి ఇంగ్లిష్ మందులను వాడడానికి ప్రజలు అలవాటు పడ్డారు. అయితే ఇంగ్లిష్ మందులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో సాధారణంగా అధిక ధరలు ఉంటాయి. ఈ ధరఘాతం నుంచి రక్షణ కేంద్ర ప్రభుత్వం జనౌషధి కేంద్రాలు పబ్లిక్ ఫార్మాస్యూటికల్ దుకాణాల ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ దుకాణాలు 2008లో భారత ప్రభుత్వంలోని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఔషధాల శాఖ ప్రారంభించారు. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) పేరుతో ఈ కేంద్రాలు ప్రచారంలో ఉన్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడమే ఈ ఔషధ కేంద్రాల లక్ష్యం. ప్రత్యేక అవుట్‌లెట్‌ల ద్వారా ప్రజలకు ధరలకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం యువత జనఔషధి కేంద్రాల ఏర్పాటు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసకుందాం.
దేశవ్యాప్తంగా మరిన్ని జనౌషధి కేంద్రాలను ప్రారంభించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తక్కువ ధరకు రుణాలు అందజేస్తుందని చాలా మంది సమాచారం ఉండదు. అలాంటి దుకాణాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఇప్పుడు సరసమైన ధరలకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ రుణాలను మానిటర్ చేస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు జనౌషధి కేంద్రాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. అనంతరం ఆ తర్వాత వారి కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభమైన ప్రక్రియగా ఉంటుంది. జనౌషధి కేంద్రానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక అనుమతి ఇస్తారు. అదే ఆధారంగా తీసుకుని డ్రగ్ లైసెన్స్ పొందడం ద్వారా తమ దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు.
జన ఔషధి దుకాణాల ఏర్పాటు కోసం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) నుంచి రూ.4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వ్యక్తికి జీఎస్టీ సహాయక్ ప్లాట్‌ఫారమ్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రుణాలు మంజూరైన వ్యక్తులు ఆ డబ్బును దుకాణానికి ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఇతర మార్గాల ద్వారా సహాయం అందుబాటులో ఉండదు. ఈ రుణాలతో ఈ ఖర్చులన్నీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఈ జనౌషధి కేంద్రాలలో ఔషధాల సరఫరా నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు ఎస్ఐడీబీఐతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటే మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








