Tata Tiago NRG: కిర్రాక్ లుక్‌తో టాటా టియాగో సీఎన్‌జీ వేరియంట్.. మతిపోగుడుతున్న నయా ఫీచర్లు
భారతదేశంలో సొంత కారు కొనుగోలు చేయాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఉండే కార్లతో పాటు నిర్వహణపరంగా కూడా సౌక్యంగా ఉండే కార్లను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ప్రముఖ కంపెనీ టాటా ఇటీవల తన టియాగో వేరియంట్‌లో సీఎన్‌జీ వెర్షన్‌ను లాంచ్ చేసింది.

భారతదేశంలో టాటా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టియాగో వేరియంట్ మధ్య తరగతి ప్రజలను అమితంగా ఆకట్టుకుంటుంది. టాటా టియాగో బలమైన క్రాస్ ఓవర్ మోడల్. అయితే తాజాగా టాటా కంపెనీ టియాగో ఎన్‌ఆర్‌జీ తాజా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో సరికొత్త ఫీచర్లు, స్టైలింగ్ అప్‌డేట్‌లు, కొత్త ట్రాన్స్‌మిషన్ ఎంపిక ఆకట్టుకుంటుంది. 2025 టాటా టియాగో ఎన్ఆర్‌జీ వేరియంట్ రూ.7.2 లక్షల నుంచి రూ.8.75 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ మోడల్ టియాగోకు సంబంధించిన టాప్-స్పెక్ ఎక్స్‌జెడ్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 2025 టియాగో మాదిరిగానే ఈ కొత్త టియాగో ఎన్ఆర్‌జీ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది.
2025 టాటా టియాగో ఎన్ఆర్‌జీ కొన్ని చిన్న చిన్న స్టైలిష్ అప్‌డేట్‌లతో ఆకర్షిస్తుంది. సరికొత్త మ్యాట్ బ్లాక్ క్లాడింగ్, ముందు మరియు వెనుక భాగంలో మందపాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్లతో కొత్తగా రూపొందించిన బంపర్‌తో పాటు 15-అంగుళాల స్టీల్ చక్రాలు రావడంతో లుక్‌పరంగా ఈ కారు అందరినీ ఆకర్షిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్ లోపల ప్రధాన మార్పులు చేశారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో పాటు రివర్స్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ కారు అందరినీ ఆకట్టుకుంటుంది.
స్టాండర్డ్ టియాగోతో పోలిస్తే టియాగో ఎన్‌ఆర్‌జీ సీట్లు, డోర్ ప్యాడ్‌లు, డ్యాష్‌బోర్డ్‌తో సహా పూర్తిగా నల్లటి క్యాబిన్‌తో ఆకర్షిస్తుంది. అలాగే ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. టాటా టియాగో ఎన్ఆర్‌జీ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 84.8 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫైవ్ స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్‌తో వస్తుంటే తాజా సీఎన్‌జీ వెర్షన్ 71 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేశారు. ఈ మోడల్‌కు సీఎన్‌జీ-ఏఎంటీ పూర్తిగా కొత్త ఎంపికగా ఉంది. అప్‌డేటెడ్ టాటా టియాగో ఎన్ఆర్‌జీ మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి