Mutual Funds: తక్కువ రిస్క్‌తో బోలెడు రాబడులు.. మార్కెట్లోకి నయా ఫండ్స్.. వివరాలివే
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంలో అనుభవం లేని వారు చాలా మంది ప్రస్తుతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈక్విటీల్లో సులభంగా పెట్టుబడులు పెట్టే అవకాశం దొరకడం,ఎక్కువ రాబడులు వస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. లిక్విడిటీ సైతం ఎక్కువగా ఉంటుంది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంలో అనుభవం లేని వారు చాలా మంది ప్రస్తుతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈక్విటీల్లో సులభంగా పెట్టుబడులు పెట్టే అవకాశం దొరకడం,ఎక్కువ రాబడులు వస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. లిక్విడిటీ సైతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారు సైతం కొత్త ఫండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎస్‌బీఐ మ్యూచవల్ ఫండ్స్ ఈసారి రెండు కొత్త ఫండ్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
బీఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్
ఎస్‌బీఐ బీఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్ పేరుతో సంస్థ న్యూ ఫండ్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ మార్చి 17న ప్రారంభమైంది. బిడ్లు సమర్పించేందుకు మార్చి 20ని గడువుగా నిర్ణయించారు. కనీస పెట్టుబడి రూ.5,000. సబ్‌స్క్రిప్షన్ పూర్తయిన తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది.
బీఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్
ఎస్‌బీఐ మ్యూచవల్ ఫండ్స్ నుంచి మరో కొత్త పథకం రాబోతోంది. ఎస్‌బీఐ బీఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ పేరుతో వస్తోన్న ఈ పథకంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ మార్చి 17వ తేదీన మొదలవుతోంది. మార్చి 20వ తేదీ వరకు యూనిట్ల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి విలువ రూ.5 వేలుగా ఉంది. ఆ తర్వాత ఎంతైనా పెట్టుబడిగా పెట్టొచ్చు.
టాటా నుంచి..
టాటా మ్యూచువల్ ఫండ్ సైతం ఈ వారం కొత్త ఫండ్‌తో అందుబాటులోకి వచ్చింది. టాటా బీఎస్ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ మార్చి 17వ తేదీన మొదలైంది. ఇది మార్చి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా కనీస పెట్టుబడి రూ.5వేలు ఉంది.
ఆదిత్య బిర్లా నుంచి..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్రిసిల్-ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9-12 నెలల డెట్ ఇండెక్స్ ఫండ్ పేరుతో దీన్ని తీసుకు వచ్చింది. ఈ ఇండెక్స్‌ను ఫండ్ ట్రాక్ చేస్తుంది. ఇది ఓపెన్ – ఎండెడ్ స్థిరమైన మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. కొత్త ఫండ్ ఆఫర్ మార్చి 18న ప్రారంభమై, మార్చి 20న ముగుస్తుంది. తక్కవ రిస్క్‌తో రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా సంస్థ తెలిపింది. స్థిరమైన మెచ్యూరిటీ, 9 నుంచి 12 నెలల వరకు రోల్ డౌన్ వ్యూహంతో ఈ ఫండ్ తక్కవ వ్యవధి ఉన్న సెక్యూరిటీలు ప్రధానంగా కమర్షియల్ పేపర్స్, డిపాజిట్ సర్టిఫికెట్లు, బాండ్లపై దృష్టి పెడుతుంది. వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులకు ఎక్కవ ప్రభావితం కాకుండా చూస్తుంది.