Top Selling Car: మారుతీ సుజుకీకి టాటా ‘పంచ్’.. అత్యధికంగా అమ్ముడైన కార్లలో టాప్ ప్లేస్ సొంతం..

గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన వ్యాగన్ ఆర్ నిలుస్తూ వస్తోంది. అయితే దాని స్థానానికి తొలిసారి టాటా కంపెనీ చెక్ చెప్పింది. టాటా నుంచి వస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది అంటే 2024లో జూలై వరకూ అంటే ఏడు నెలల కాలంలో మన దేశంలో జరిగిన కార్ల విక్రయాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

Top Selling Car: మారుతీ సుజుకీకి టాటా ‘పంచ్’.. అత్యధికంగా అమ్ముడైన కార్లలో టాప్ ప్లేస్ సొంతం..
Tata Punch
Follow us

|

Updated on: Aug 23, 2024 | 4:56 PM

ఇప్పటి వరకూ మన దేశంలో టాప్ సెల్లింగ్ కార్లు అంటే అవి మారుతీ సుజుకీ నుంచే ఉండేవి. తక్కువ ధరలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందించడంతో మారుతీ సుజుకీ ముందు వరుసలో ఉంటుంది. చిన్న సైజ్ కార్లను అనువైన బడ్జెట్లో అందిస్తుండటంతో చాలా ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన వ్యాగన్ ఆర్ నిలుస్తూ వస్తోంది. అయితే దాని స్థానానికి తొలిసారి టాటా కంపెనీ చెక్ చెప్పింది. టాటా నుంచి వస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది అంటే 2024లో జూలై వరకూ అంటే ఏడు నెలల కాలంలో మన దేశంలో జరిగిన కార్ల విక్రయాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ డేటా అందిస్తున్న వివరాల ప్రకారం ఈ ఏడు నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

కార్ల అమ్మకాలు ఇలా..

2024లో ఏడు నెలలు అంటే జనవరి నుంచి జూలై వరకూ దేశంలో అమ్ముడైన కార్ల వివరాలు పరిశీలిస్తే టాటా పంచ్ 1.26లక్షల యానిట్ల విక్రయాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత మారుతీ సుజుకీ వ్యాగనార్ 1.16లక్షల యూనిట్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. మూడు స్థానంలో 1.09లక్షల యూనిట్ల విక్రయాలతో హ్యూందాయ్ క్రెటా నిలిచింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా 1.05లక్షల విక్రయాలతో నాలుగో స్థానం, 1.04లక్షల యూనిట్ల విక్రయాలతో మారుతీ సుజుకీ ఎర్టిగా ఐదో స్థానంలో నిలిచింది.

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేదు..

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశంలోనే నంబర్ వన్ గా కితాబును అందుకుంటోంది. ఈ క్రమంలో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారును వెనక్కి నెట్టి అమ్మకాల్లో అగ్రస్థానలో నిలిచింది. తమ విజయానికి ప్రధాన కారణాలను టాటా సంస్థ విశ్లేషించింది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో పూర్తి స్థాయి ఎస్‌యూవీ ఫీచర్లను టాటా పంచ్ కారులో అందివ్వడం, అది కూడా అతి తక్కువ ధరకే వాటిని అందివ్వడంతో అందరూ వీటివైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. అంతేకాక ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండటం కూడా మేలు చేస్తోందని టాటా చెబుతోంది. ఇప్పటి వరకూ అయిన సేల్స్ పరిశీలిస్తే దాదా 47శాతం సేల్స్ ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్లే ఉన్నాయని వివరిస్తోంది. ఇతర కంపెనీల్లో పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ లేదా డీజిల్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, తమ టాటా లో ఎలక్ట్రిక్ ఉండటం కూడా సేల్స్ పెరగడానికి ప్రధాన కారణంగా టాటా గ్రూప్ వర్గాలు చెబుతున్నాయి.

జూలైలో మాత్రం నాలుగో స్థానం..

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఒకటి ఉంది. అదేంటంటే గత నెల అంటే జూలైలో అమ్ముడైన కార్లను పరిశీలిస్తే టాటా పంచ్ బాగా వెనుకబడింది. ఓవరాల్ గా టాప్ ఉన్న కారు జూలైలో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. జూలైలో హ్యూందాయ్ క్రెటా అత్యధిక అమ్మకాలు చేసిన కారుగా నిలిచింది. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ ను కూడా ఇది వెనక్కి నెట్టడం విశేషం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..