Reliance: రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌లో భారీ పెట్టుబడి.. టారిఫ్ లు పెరగనున్నాయా.. ?

దీపావళి నుంచి రిలయన్స్ జియో 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే టెలికం రంగంలో ఎన్నో మార్పులు రానున్నాయి. అలాగే మొబైల్ టారిఫ్..

Reliance: రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌లో భారీ పెట్టుబడి.. టారిఫ్ లు పెరగనున్నాయా.. ?
Jio 5g
Follow us
Amarnadh Daneti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:14 PM

Reliance: దీపావళి నుంచి రిలయన్స్ జియో 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే టెలికం రంగంలో ఎన్నో మార్పులు రానున్నాయి. అలాగే మొబైల్ టారిఫ్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.రిలయన్స్ సంస్థ జియో 5జీ నెట్‌వర్క్‌లో రూ.2 ట్రిలియన్ల (రెండు లక్షల కోట్లు) పెట్టుబడిని పెట్టింది. దీనిని సొమ్ము చేసుకునేందుకు టారిఫ్‌లను పెంచాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు దాదాపు అన్ని టెలికం సంస్థలు రానున్న రెండేళ్లలో 5G లో అధికంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సంస్థల మధ్య పోటీ పెరిగితే ఆఫర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందనే అంచనా నేపథ్యంలో ముందుగానే టారిఫ్ రేట్లను పెంచే యోచనలో రిలయన్స్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి నాటికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై సహా కీలక మెట్రో నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

టెలికం రంగ నిపుణులు అంచనా ప్రకారం సిమ్ కార్డులు, టారిఫ్ పెంపుదల ద్వారా జియో 4 నుంచి 5 బిలయన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జియో తన 5G సేవల కోసం సొంత టెక్నాలజీని అమలు చేస్తుంది, ఇది 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. జియో యొక్క 5G నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది, అత్యంత అధునాతనమైనదిగా ఉండనుంది. తొలుత రిలయన్స్, ఎయిర్ టెల్ సంస్థలకు సంబంధించిన 5G సేవలు మాత్రమే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో. ఈరెండు కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈపెంపుదల ఎంతమేర ఉంటుందనే దానిపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. ఒకవేళ మొబైల్ ప్లాన్ టారిఫ్ ధరలు పెరిగితే.. ఇవి సామాన్యుడికి భారం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!