FD Rates: కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన 102ఏళ్ల ప్రైవేట్ బ్యాంక్.. ఫిక్సిడ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు.. 300రోజుల వ్యవధిలోనే..!!
తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్...ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఇది ఒకటి. 1921లో స్థాపించబడిన ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 509 శాఖలు, 12 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్…ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఇది ఒకటి. 1921లో స్థాపించబడిన ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 509 శాఖలు, 12 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అంటే ఈ బ్యాంకు ఆవర్భించి దాదాపు వందేళ్లు పూర్తి చేకుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ రేట్ల పెంపు వర్తించనుంది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి భారీ ఊరట కలుగుతుంది. పెరిగిన వడ్డీ రేట్లతో కస్టమర్లకు ఇక నుంచి గతంలో కంటే ఎక్కువ రాబడి వస్తుంది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ FD రేట్లు
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు ఈ ఏడాది జనవరి 2 నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. 7 రోజుల నుండి 120 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, బ్యాంక్ ఇప్పుడు 5.25 శాతం, 121 రోజుల నుండి ఏడాదిలోపు మెచ్యూరిటీ ఉన్న వాటిపై ఇప్పుడు 6 శాతం, 300 రోజుల డిపాజిట్ వ్యవధిపై బ్యాంక్ గరిష్టంగా 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ఏడాది నుంచి రెండేళ్లలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 7 శాతం వడ్డీ రేటు, రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు 6.75శాతం, మూడేళ్ల నుంచి పదేళ్లలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, 6.50 శాతంప్రామాణిక వడ్డీ రేటును పెంచినట్లు బ్యాంకు తెలిపింది. దీని ద్వారా సీనియర్ సిటిజన్లు అదనపు బెనిఫిట్స్ పొందుతారు. వారికి 7.5శాతం వడ్డీరేటు అందుబాటులో ఉంటుంది. 300 రోజుల డిపాజిట్ అవధిపై, బ్యాంక్ గరిష్టంగా 8.5 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. వీరికి మూడేళ్ల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టాండర్డ్ రేట్ల కంటే 0.5శాతం లేదా 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది.
మరో 25 శాఖ తెరిచే యోచనలో:
తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు శాఖలను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో 25 శాఖలను తెరవాలని యోచిస్తోంది. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లతో త్రైమాసికంలో బీమా ఉత్పత్తుల కోసం భాగస్వామ్యాలపై సంతకం చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది.
రిజర్వు బ్యాంకు రెపోరేటు వల్లే:
ఆర్ బీఐ రెపోరేటు వల్లే బ్యాంకులు వరుసపెట్టి ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. ఎస్ బిఐ నుంచి పంజాబ్ నేషన్ బ్యాంకు వరకు చాలా బ్యాంకులు ఎఫ్ డి వడ్డీ రేట్లను పెంచేసాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఎఫ్‌డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. గతంలో కంటే ఇప్పుడు బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లు చేసే వారికి అధిక వడ్డీ రేటు లభిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..