Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి
కుమార్తెల భవిష్యత్ అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునేవారి కోసం కేంద్రం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కుక వడ్డీ ఈ స్కీమ్‌లో లభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇందులో పెట్టుబడి పెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ది యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు బెస్ట్ స్కీమ్ ఇది. ఇందులో పొదుపు చేసే డబ్బులకు 8.2 శాతం వడ్డీ లభించడంతో పాటు ప్రభుత్వ పథకం కావడంతో మీ డబ్బులకు భద్రత కూడా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పిల్లలకు ఆర్ధిక భరోసా కల్పించవచ్చు. ప్రతీ నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టడం వల్ల 21 ఏళ్లల్లో రూ.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.
ఖాతా ఎవరెవరు తెరవొచ్చంటే..?
సుకన్య సమృద్ది యోజన అనేది కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు నమ్మకమైన, భద్రత కల్పించే పెట్టుబడి పథకంగా చెప్పవచ్చు. ఇందులో పెట్టుండి పెడితే ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవ్. కుమార్తెల కోసం కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక పొదుపు పథకం ఇది. కుమార్తెకు 10 సంవత్సరాలు నిండకముందే ఈ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతా తెరవొచ్చు.
నియమాలు ఏంటి..?
15 సంత్సరాల పీరియడ్‌కు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 21వ సంవత్సరంలో మొత్తం తీసుకోవచ్చు. ఇక కుమార్తెకు 18 ఏళ్లు నిండాక లేదా పదో తరగతి పూర్తయ్యాక 50 శాతం వరకు నిధులు అవసరమైతే తీసుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏంటంటే.. వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై కూడా ఎలాంటి ట్యాక్స్‌లు కట్ చేయరు. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటాయి.
రూ.50 లక్షలు పొందాలంటే..?
కుమార్తె పుట్టగానే మీరు సంవత్సరానికి రూ.లక్ష ఇందులో పెట్టుబడి పెట్టాలి. వడ్డీ రేటు 8.2 శాతంగా తీసుకుంటే మీకు 21 సంవత్సరాల తర్వాత రూ.50 లక్షలు అందుతాయి. కుమార్తె పెద్దయ్యాక ఉన్నత చదువులు, పెళ్లికి ఇది సహాయపడతాయి. మీ పిల్లలకు ఆర్ధిక భరోసా కూడా ఈ పథకం అందిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేటును మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి 8.2 శాతం వడ్డీ ప్రకటించింది. భవిష్యత్తులో వడ్డీని పెంచే అవకాశం కూా ఉంటుంది. దీని వల్ల మీరు ఎక్కువ డబ్బులు పొందవ్చచు. ప్రస్తుతం ఈ పథకంలో లక్షలాది మంది పెట్టుబడి పెడుతున్నారు. ఫిక్స్ డ్ డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ ఎక్కువగా ఉండటంతో వీటిల్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి.
