AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!

Success Story: ఫుడ్ డెలివరీ కోసం కొన్ని ఇతర కంపెనీల సేవలపై ఆధారపడటంతో తలెత్తిన సమస్యల కారణంగా ఆ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. అప్పుడే కుశాల్ రెడ్డి, సహక్ హెయిన్ ఈ రంగంలో ఎలాగైనా పురోగతి సాధించాలనే లక్ష్యంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు..

Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!
Success Story
Subhash Goud
|

Updated on: Sep 11, 2026 | 8:42 PM

Share

Success Story:  చాలా మందికి వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. కానీ, వ్యాపారం ప్రారంభిస్తే అది విజయవంతం అవుతుందా లేదా, ఒకవేళ నష్టం వస్తే ఏం చేయాలి అనే సందిగ్ధతతో చాలా మంది వ్యాపారం మొదలుపెట్టరు. వీటన్నింటినీ తామే పరిష్కరించుకోగలమని భావించి వ్యాపారం ప్రారంభించిన చాలా మంది వైఫల్యాన్ని కూడా చవిచూశారు. వ్యాపారం ప్రారంభించడానికి చాలా మందికి ఇది ఒక పెద్ద అడ్డంకి. ఇలాంటి పరిస్థితుల్లోనే బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫుడ్ ట్రక్ వ్యాపారం ద్వారా కేవలం 10 నెలల్లోనే రూ. 2 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించారు. క్రీడ్ స్టార్టప్ కంపెనీ ఎలా ఏర్పడిందో చూద్దాం.

ట్రెండ్‌కు అనుగుణంగా తమ వ్యాపారాలను ప్రారంభించి విజయవంతమైన ఇద్దరు వ్యక్తులు.. బెంగళూరుకు చెందిన కుశాల్ రెడ్డి, సహక్ హెయిన్ కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్‌ చేశారు. వారు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు వారి ఆలోచనలు ఆహార రంగం వైపు మళ్లాయి. దానికి అనుగుణంగా, వారు కేవలం రూ. 4 లక్షల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. క్లౌడ్ కిచెన్ అంటే ఆహార ఆర్డర్‌లను కేవలం ఇంటర్నెట్ ద్వారానే స్వీకరించి, డెలివరీ చేయడం. కానీ, ఈ వ్యాపారంలో కూడా ఖర్చులకు కొదవే లేదు.

ఇది కూడా చదవండి: Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!

ఇవి కూడా చదవండి

ఫుడ్ డెలివరీ కోసం కొన్ని ఇతర కంపెనీల సేవలపై ఆధారపడటంతో తలెత్తిన సమస్యల కారణంగా ఆ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. అప్పుడే కుశాల్ రెడ్డి, సహక్ హెయిన్ ఈ రంగంలో ఎలాగైనా పురోగతి సాధించాలనే లక్ష్యంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దానికి అనుగుణంగా ఈసారి వారు చెన్నైలో ఫ్రైడ్ చికెన్‌, బర్గర్ ఫుడ్ ట్రక్కును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మొదటిసారి చేసిన తప్పులను మళ్లీ చేయకూడదనే ప్రణాళికతో వారు పనిచేశారు.

10 నెలల్లో రూ.2 కోట్ల ఆదాయం

ఈ వ్యాపారం ప్రారంభమైనప్పటి నుండి ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. కేవలం 10 నెలల్లోనే, వారిద్దరూ కలిసి రూ. 2 కోట్ల ఆకట్టుకునే ఆదాయాన్ని ఆర్జించారు.

ఇది కూడా చదవండి: Gold: బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం.. రూ.1 లక్షకు రూ.3.04 లక్షలు!

ఇది కూడా చదవండి: Vinayaka Chavithi: వీధుల్లో భారీ వినాయకుడిని ఎందుకు పెడతారు? దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
"తీవ్రవాదులమా?"వీసాలున్నాభారత్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పాక్
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే
దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే