Vehicle Tyres: కార్, బైక్ టైర్లపై ఉండే ఈ చివరి అక్షరం అర్థం ఏంటో తెలుసా? మీ ప్రాణాలు కాపాడే సమాచారం..!
Vehicle Tyre Speed Rationg: మీ వాహనం వేగం కంటే టైర్ స్పీడ్ రేటింగ్ తక్కువగా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది . అందుకే మీ వాహనం టైర్‌పై ఏ లెటర్ ఉందో వెంటనే సరిచూసుకుని, ఆ వేగ పరిమితికి లోబడే ప్రయాణించడం..

Vehicle Tyre Speed Rationg: ఈ రోజుల్లో కారు, బైక్‌లు చాలా మంది వద్దే ఉంటాయి. కానీ వాహనాల టైర్ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా మందికి తెలియవు. చాలా మంది వాహనాల టైర్లు త్వరగా పాడైపోతుంటాయి. ఎంతటి మంచి రోడ్డు ఉన్నప్పటికీ త్వరగా అరిపోవడానికి ప్రధాన కారణాలు ఉంటాయన్న విషయం తెలియదు. వాహనం స్పీడ్ అనేది కారు టైర్లపై ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే కార్లు, బైక్‌లు ఉన్నవారు టైర్ల స్పీడ్ లిమిట్ గురించి తప్పకుండా తెలిసి ఉండాలి.
కార్ లేదా బైక్ టైర్లపై వివరాలను గమనిస్తే చివరిలో L, M, V లేదా Y వంటి ఆంగ్ల అక్షరాలు కనిపించడం మనం చూస్తుంటాం అయితే వీటిని చాలామంది ఏదో కోడ్ అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అందులోనే ఉంది అసలు మ్యాటర్. కానీ, టైర్ పై ఉండే ఈ చివరి అక్షరం ఆ వాహన భద్రతలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనినే ‘స్పీడ్ రేటింగ్’ (Speed Rating) అంటారు.
స్పీడ్ రేటింగ్ అంటే ఏమిటి?
మీ వాహనం టైర్ ఎంత గరిష్ట వేగాన్ని సురక్షితంగా తట్టుకోగలదో ఈ స్పీడ్ రేటింగ్ సూచిస్తుంది. ఉదాహరణకు, మీ టైర్ చివరిలో ‘L’ అనే అక్షరం ఉంటే, ఆ టైర్ గరిష్టంగా 120 కి.మీ/గంటకు ఈ వేగంతో మాత్రమే డిజైన్ చేసినట్లు అర్థం. ఒకవేళ మీరు ఆ పరిమితిని దాటి ప్రతిరోజూ 130 లేదా 140 కి.మీ వేగంతో డ్రైవ్ చేస్తే, టైర్ వేడెక్కి పేలిపోవడం లేదా ఫెయిల్ అవ్వడం జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివిధ టైర్లపై గరిష్ట వేగ పరిమితులు, గంటకు (Speed Limits):
L – 120 కి.మీ వేగం
M – 130 కి.మీ వేగం
N – 140 కి.మీ వేగం
P – 150 కి.మీ వేగం
Q – 160 కి.మీ వేగం
R – 170 కి.మీ వేగం
S – 180 కి.మీ వేగం
T – 190 కి.మీ వేగం
U – 200 కి.మీ వేగం
H – 210 కి.మీ వేగం
V – 240 కి.మీ వేగం
W – 270 కి.మీ వేగం
Y – 300 కి.మీ వేగం
మీ వాహనం వేగం కంటే టైర్ స్పీడ్ రేటింగ్ తక్కువగా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది . అందుకే మీ వాహనం టైర్‌పై ఏ లెటర్ ఉందో వెంటనే సరిచూసుకుని, ఆ వేగ పరిమితికి లోబడే ప్రయాణించడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
