Stock Market: నష్టాలతోనే వారం ప్రారంభం.. ఆర్బీఐ ప్రకటన కోసం అందరి ఎదురు చూపు..
Stock Market: మానిటరీ పాలసీ భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. రిజర్వు బ్యాంక్ ఎలాంటి నిర్ణయాలను వెలువరిస్తుంది అనే ఆందోళనలోకి మార్కెట్లు బేజారాయి.
Stock Market: మానిటరీ పాలసీ భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. రిజర్వు బ్యాంక్ ఎలాంటి నిర్ణయాలను వెలువరిస్తుంది అనే ఆందోళనలోకి మార్కెట్లు బేజారాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఎంపీసీ సమీక్ష సమావేశం జరుగుతోంది. బుధవారం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలను వెలువరించనుంది. ఈ కారణాలతో వారం ప్రారంభంలో మార్కెట్లు కొంత నెగటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.45 గంటల సమయానికి బెంట్ మార్క్ సూచీ నిఫ్టీ-50.. 92 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుండగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 322 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 96 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 286 పాయింట్లు నష్టపోయాయి. ఈ సమయంలో మార్కెట్లలో పెద్దగా మెుమెంటం లేదు. చాలా మంది ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ 1.98%, బజాజ్ ఆటో 1.46%, సిప్లా 1.22%, ఎన్టీపీసీ 0.74%, గెయిల్ 0.71%, టాటా స్టీల్ 0.70%, ఐటీసీ 0.29%, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ 0.23%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.21%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.08% మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 6.69%, హెచ్పీసీఎల్ 3.03%, బజాజ్ ఫిన్ సర్వ్ 2.99%, టెక్ మహీంద్రా 2.84%, బీపీసీఎల్ 2.59%, గ్రాసిమ్ ఇండ్రస్ట్రీస్ 1.82%, హీరో మోటోకార్ప్ 1.82%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1.77%, జీ ఎంటర్టైన్ మెంట్ 1.75%, విప్లో లిమిటెడ్ 1.69% నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.