ఆర్బీఐ మాట కోసం మదుపరుల ఎదురుచూపు.. ఈ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

MARKET HIGHLY VOLATILE: బడ్జెట్ ప్రతిపాదనకు ముందు నుంచి వరుసగా ఒడిదుడుకుల్లో మార్కెట్లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో పాటు దేశీయంగా కొనసాగుతున్న..

ఆర్బీఐ మాట కోసం మదుపరుల ఎదురుచూపు.. ఈ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
Volatile
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 06, 2022 | 1:39 PM

MARKET HIGHLY VOLATILE: బడ్జెట్ ప్రతిపాదనకు ముందు నుంచి వరుసగా ఒడిదుడుకుల్లో మార్కెట్లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో పాటు దేశీయంగా కొనసాగుతున్న పరిణామాలు, బడ్జెట్ లో వివిధ సెక్ట్రార్లకు కేటాయింపులు, క్రిప్టో ట్రేడింగ్ పై టీడీఎస్, 30 శాతం ట్యాక్స్ వంటి అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా.. ఈ వారం ఆర్బీఐ సమావేశం(RBI policy) ఉండడంతో పాటు పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి, అంతర్జాతీ మార్కెట్లో రూపాయి ధర, క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ సంస్ధాగత పెట్టుబడులు వంటి అనేక అంశాలు మదుపరులు తీసుకోబోయే పెట్టుబడి నిర్ణయాలకు మార్గనిర్ధేశం చేయనున్నాయి. ఈ కారణంగా.. ఈ వారం కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుగుల్లోనే ట్రేడ్ అవుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీటిలో ప్రధానంగా ఫిబ్రవరి 9 న జరగనున్న ఆర్బీఐ మానిటరీ సమావేశంపైనా అందరి దృష్టి ఉంది. దీనికి తోడు ఫిబ్రవరి 11న వచ్చే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక వివరాలు మదుపరులను ముందుకు నడిపించనున్నాయి. తాజాగా పెరుగుతున్న క్రూడ్ ధరలు భారత మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత మార్కెట్లను అధికంగా ప్రభావితం చేస్తూ.. ఆందోళన కలిగిస్తున్న ఏంటంటే విదేశీ పెట్టుబడి దారులు(FIIs) తమ వాటాలను గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న ట్రేడింగ్ సెషన్లలో ఉపసంహరించుకోవడం. బాండ్ ఈల్డ్ ఎక్కువగా ఉండడంతో.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుతులను ఈక్విటీల నుంచి అటుగా మళ్లిస్తున్నారు.

తాజా బడ్జెట్ మార్కెట్ అంచనాలను అందుకోవడంతో మెుదటి వారం మార్కెట్లు బుల్ మూడ్ లో ఉన్నప్పటికీ.. ఈ వారం మాత్రం ఎక్కువ ఓలటైల్(VOLATILE) గా ఉండనున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ఈ మూడు పెద్ద బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. సేవింగ్ ఖాతా వడ్డీ రేట్లు మారాయి.. మారిన కొత్త రేట్లను ఇలా..

Tata Steel: టాటా స్టీల్‌కు లాభాల పంట.. త్రైమాసికంలో భారీగా పెరిగిన ఆదాయం..!

Aadhaar PVC Card: ఒక మొబైల్ నంబర్‌తో మొత్తం కుటుంబానికి ఆధార్ PVC కార్డ్‌లను ఎలా తీసుకోవాలో తెలుసా.. ఇలా చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!