AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking News: దీపావళికి ముందే ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ పెరుగుదల ఉంది. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్..

Banking News: దీపావళికి ముందే ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు
SBI
Subhash Goud
|

Updated on: Oct 15, 2022 | 4:58 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ పెరుగుదల ఉంది. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్ 15, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. రెండు నెలల విరామం తర్వాత రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల మధ్య పెరుగుతాయి.

ఎస్‌బీఐలో 46 రోజుల నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 4 శాతం చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంతకు ముందు ఈ కాలానికి వడ్డీ రేటు 3.90 శాతం. వడ్డీ రేట్లలో మార్పు తరువాత, 180 రోజుల నుండి 210 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.55 శాతం నుండి 4.65 శాతానికి పెరిగింది. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటును 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువగా ఉన్న డిపాజిట్లపై 4.60 శాతం నుంచి 4.70 శాతానికి పెంచింది. ఎస్‌బీఐ రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ ఖాతాలపై ఒక సంవత్సరం నుండి రెండేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు ఇప్పుడు 5.45 శాతం నుండి 5.60 శాతానికి పెరిగింది.

సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లు:

రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు తక్కువ కాల వ్యవధి గల ఎఫ్‌డీలపై, వడ్డీ రేటు 5.50 శాతం నుండి 5.65 శాతానికి పెరిగింది. అదే సమయంలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60 శాతం నుంచి 5.80 శాతానికి పెరిగింది. కాగా, ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.65 శాతం నుంచి 5.85 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ల కోసం 7 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు 3.5 శాతం వడ్డీని ఆకర్షిస్తుంది. ఇంతకుముందు ఈ కాలానికి వడ్డీ రేటు 3.40 శాతం. అదే సమయంలో 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 4.40 శాతం నుంచి 4.50 శాతానికి పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..