Maruti S-Presso: మారుతి సుజుకీ నుంచి సీఎన్‌జీ మోడల్‌ కారు.. కిలో గ్యాస్‌తో 32.73 మైలేజీ.. ధర ఎంతంటే..!

దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి S- Presso ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ సరికొత్త సీఎన్‌జీ కారును LXi, VXi అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. LXi మోడల్..

Maruti S-Presso: మారుతి సుజుకీ నుంచి సీఎన్‌జీ మోడల్‌ కారు.. కిలో గ్యాస్‌తో 32.73 మైలేజీ.. ధర ఎంతంటే..!
Martuti S Presso
Follow us
Subhash Goud

|

Updated on: Oct 15, 2022 | 2:30 PM

దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి S- Presso ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ సరికొత్త సీఎన్‌జీ కారును LXi, VXi అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. LXi మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షలు కాగా, VXi మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.10 లక్షలు. ఎస్-ప్రెస్సోలో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. అయినప్పటికీ , మారుతి S-ప్రెస్సో డ్యూయల్‌జెట్ ఇంజన్‌ను సీఎన్‌జీతో నడిచేందుకు అప్‌డేట్ చేసింది. ఈ కారు ఒక కిలో సిఎన్‌జితో 32.73 కి.మీల దూరం మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. S-Presso  సీఎన్‌జీ కారు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను ఇక్కడ చూడండి.

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సోలో 1.0-లీటర్ కె సిరీస్, డ్యూయెల్‌ జెట్‌ ఇంజన్ ఉపయోగించబడింది. పవర్ ట్రాన్స్‌మిషన్ కోసం కంపెనీ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించింది. సీఎన్‌జీ మోడల్‌లో కూడా, మారుతి ఈ ఇంజిన్ శక్తిని ఉపయోగించింది. మారుతి ఎస్‌-ప్రెస్సో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఇవ్వబడింది.

మారుతి ఎస్‌-ప్రెస్సో ఎస్‌-పీఎన్‌జీ మైలేజ్:

మారుతి సుజుకి తాజా సీఎన్‌జీ కారు మైలేజీ ఈ కారు ఒక కిలో సీఎన్‌జీకి 32.73 కిమీ మైలేజీని ఇస్తుంది. దాని పెట్రోల్ వేరియంట్ Vxi(O)/Vxi+(O) AGS వేరియంట్ మైలేజ్ 25.30 kmpl. ఇది కాకుండా Vxi / Vxi + MT వేరియంట్ 24.76 kmpl మైలేజీని ఇస్తుంది. మరోవైపు, Std/Lxi MT వేరియంట్ కు చెందిన కారు మైలేజ్ 24.12 kmpl.

ఇవి కూడా చదవండి

మారుతీ ఎస్-ప్రెస్సో: 2.26 లక్షల యూనిట్లు విక్రయం:

సీఎన్‌జీ మోడల్‌ను విడుదల చేసిన తర్వాత మారుతి ఎస్‌-ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.25 లక్షల నుండి రూ. 6.10 లక్షల వరకు ఉంది. భారతీయ మార్కెట్లో ఇది రెనాల్ట్ క్విడ్, టాటా పంచ్‌లతో పోటీపడుతుంది. మారుతి ఎస్‌-ప్రెస్సో 2.26 లక్షల యూనిట్లకు పైగా విక్రయించబడిన దేశంలోని ప్రముఖ కారు. సీఎన్‌జీ వెర్షన్ లాంచ్ తర్వాత దాని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి సుజుకి అతిపెద్ద సీఎన్‌జీ కార్లను కలిగి ఉంది. ఎస్‌-ప్రెస్సో సీఎన్‌జీ మోడల్‌తో కంపెనీ మొత్తం 10 సీఎన్‌జీ వెర్షన్‌లను కలిగి ఉంది. ఈ కార్లన్నింటికీ సీఎన్‌జీ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు, జాయింట్లు కోసం ఇంటిగ్రేటెడ్ వైరింగ్ జీనుతో కూడిన డ్యూయల్-ఇండిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌ను అమర్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!