MSSC Scheme: పోస్టాఫీసులో మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడితో నమ్మలేని వడ్డీ
కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో ప్రత్యేక పొదుపు పథకం ప్రవేశపెట్టింది. ఇది మహిళా డిపాజిటర్ల కోసం పరిమిత కాల వ్యవధి పథకం. ఈ పథకం రెండేళ్లలో మెచ్యూర్ అవుతుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ రూ. 1,000-2,00,000 శ్రేణిలో వన్-టైమ్ డిపాజిట్‌ను అనుమతిస్తుంది. ఈ పథకంలో పోస్టాఫీసులు, ఎంపిక చేసిన వాణిజ్య బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. మహిళల కేంద్రీకృత పెట్టుబడి పథకంలో రూ. 10,000 డిపాజిట్ రెండేళ్ల వ్యవధిలో రూ. 11,602కి పెరిగుతుంది.

ప్రభుత్వం మహిళల్లో పొదుపుపై ఆసక్తి కల్పించడానికి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పేరుతో ప్రత్యేక పొదుపు పథకం ప్రవేశపెట్టింది. ఇది మహిళా డిపాజిటర్ల కోసం పరిమిత కాల వ్యవధి పథకం. ఈ పథకం రెండేళ్లలో మెచ్యూర్ అవుతుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ రూ. 1,000-2,00,000 శ్రేణిలో వన్-టైమ్ డిపాజిట్‌ను అనుమతిస్తుంది. ఈ పథకంలో పోస్టాఫీసులు, ఎంపిక చేసిన వాణిజ్య బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. మహిళల కేంద్రీకృత పెట్టుబడి పథకంలో రూ. 10,000 డిపాజిట్ రెండేళ్ల వ్యవధిలో రూ. 11,602కి పెరిగుతుంది. అలాగే మూసివేసే సమయంలో మొత్తం సొమ్ము డిపాజిటర్ ఖాతాలో జమ అవుతుంది.
ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం మార్చి 31, 2024తో ముగిసే త్రైమాసికంలో ఈ పథకం వార్షికంగా కలిపి 7.5 శాతం రాబడిని అందిస్తుంది. ఈ రేటు ప్రకారం ఖాతాలోని రూ. 2 లక్షల మొత్తం రూ. 32,044 వడ్డీతో సహా రూ.2,32,044కి పెరుగుతుంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను మహిళలు తమ కోసం లేదా మైనర్ బాలికకు అనుకూలంగా సెటప్ చేసుకోవచ్చు. మహిళల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ పెట్టుబడి ప్రణాళికలో డబ్బు ఎలా పెరుగుతుందో? ఓ సారి తెలుసుకుందాం.
పెట్టుబడి, మెచ్యూరిటీ సమయంలో రాబడి
ఈ పథకంలో మహిళలు రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ.11,602 రాబడి వస్తుంది. రూ.15 వేలకు రూ.17,403, రూ. 20 వేలకు రూ.23,204, రూ.25 వేలకు రూ.29,006, రూ.30 వేలకు రూ.34,807, రూ.50 వేలకు రూ.58,011 రాబడి వస్తుంది. అలాగే రూ. లక్షకు రూ.1,16,022, రూ.1,50,000కు రూ.1,74,033, రూ. 2 లక్షలకు రూ.2,32,044 రాబడిని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి