Ola: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఓలా స్కూటర్‌పై ఆఫర్ పొడగింపు..
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,29,999కాగా, ఎస్1 ఎయిర్ స్కూటర్ ధర రూ. 1,04,999కాగా, ఎస్‌ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 84,999కి లభిస్తుంది. ఇదిలా ఉంటే ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఇచ్చారు. సింగిల్ ఛార్జింగ్ తో 151 కిలోమీటర్ల...

ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహనాల తయార సంస్థ ఓలా యూజర్లకు శుభవార్త తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌ను అందించిన విషయం తెలిసిందే. ఓలా కంపెనీకి చెందిన పలు మోడల్స్‌పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఆఫర్‌ను ఓలా పొడగించింది. మార్చి నెల చివరి వరకు ఈ ఆఫర్ ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,29,999కాగా, ఎస్1 ఎయిర్ స్కూటర్ ధర రూ. 1,04,999కాగా, ఎస్‌ఎక్స్+ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 84,999కి లభిస్తుంది. ఇదిలా ఉంటే ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఇచ్చారు. సింగిల్ ఛార్జింగ్ తో 151 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.
కాగా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. అలాగే ఇందులో 6 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. దీని వల్ల ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ గత మూడు నెలల్లో దాదాపు 1,00,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిందని, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరిలో 30,000 కంటే ఎక్కువ యూనిట్లు స్థిరంగా నమోదయ్యాయని ఓలా కంపెనీ తెలిపింది.
ఫిబ్రవరిలో 35,000 రిజిస్ట్రేషన్‌లను సాధించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ మార్చి 1న ఒక మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. 42% మార్కెట్ వాటాతో EV 2W (టూ-వీలర్) విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విషయమై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘మేము మా రిజిస్ట్రేషన్లు, మార్కెట్ వాటాలో స్థిరమైన వృద్ధిని సాధించాము. మార్కెట్లో మా నాయకత్వ స్థానాన్ని దృఢంగా కొనసాగించాము’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




