AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Offers: ఈ క్రెడిట్ కార్డులతో రెండు రూపాయలకే బొలెడన్ని ప్రయోజనాలు.. రైల్వే స్టేషన్స్‌లో ప్రత్యేక సదుపాయాలు

దేశంలోని అనేక ప్రధాన రైలు స్టేషన్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఎగ్జిక్యూటివ్ లాంజ్ సేవలను అందిస్తాయి. ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో మీరు లగ్జరీగా రైలు కోసం వేచి ఉండవచ్చు. ప్రయాణికులు రైల్వే లాంజ్‌లో టీ, కాఫీ, పీరియాడికల్స్, వార్తాపత్రికలు, వైఫై, రైలు సమాచారం, విశ్రాంతి గదులు, ఇతర సౌకర్యాలను పొందవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే కొన్ని రకాలు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం రూ. 2కే ఈ సౌకర్యాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు.

Credit Card Offers: ఈ క్రెడిట్ కార్డులతో రెండు రూపాయలకే బొలెడన్ని ప్రయోజనాలు.. రైల్వే స్టేషన్స్‌లో ప్రత్యేక సదుపాయాలు
Credit Card
Nikhil
|

Updated on: Mar 01, 2024 | 8:00 PM

Share

భారతీయ రైల్వేలు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజారవాణా సాధనాల్లో ఒకటిగా ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత రద్దీ నెట్‌వర్క్‌లలో ఒకటి. ఏటా 11 బిలియన్లకు పైగా ప్రయాణీకులను, 1.416 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. రైల్వేలు సామాన్యులకు సుదూర రవాణాకు అత్యంత చౌకైన మార్గం. భారతీయ రైల్వే తన ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. దేశంలోని అనేక ప్రధాన రైలు స్టేషన్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఎగ్జిక్యూటివ్ లాంజ్ సేవలను అందిస్తాయి. ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో మీరు లగ్జరీగా రైలు కోసం వేచి ఉండవచ్చు. ప్రయాణికులు రైల్వే లాంజ్‌లో టీ, కాఫీ, పీరియాడికల్స్, వార్తాపత్రికలు, వైఫై, రైలు సమాచారం, విశ్రాంతి గదులు, ఇతర సౌకర్యాలను పొందవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే కొన్ని రకాలు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం రూ. 2కే ఈ సౌకర్యాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. ఈ ప్రయోజనాన్ని అందించే అనేక క్రెడిట్ కార్డ్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. కేవలం రూ. 2 లావాదేవీని రైల్వే లాంజ్ ఆపరేటర్ నాన్-రిఫండబుల్ కార్డ్ ధ్రువీకరణ ఛార్జీగా విధిస్తారు. కాబట్టి ఉచిత రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందించే కొన్ని క్రెడిట్ కార్డ్‌ల వివరాలను తెలుసుకుందాం.

ఎగ్జిక్యూటివ్ ప్రయోజనాలందించే కార్డులివే

  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డ్
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్త్ క్రెడిట్ కార్డ్
  • ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్
  • ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్
  • ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్
  • ఐఆర్‌సీటీసీ బీఓబీ రూపే క్రెడిట్ కార్డ్
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్
  • మేక్‌ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
  • మేక్‌ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
  • ఐసీఐసీ బ్యాంక్ రూబిక్స్ క్రెడిట్ కార్డ్

ఈ స్టేషన్స్‌లోనే సేవలు

  • ట్రావెలర్స్ ఎగ్జిక్యూటివ్ లాంజ్- న్యూఢిల్లీ – ప్లాట్‌ఫారమ్ నం. 16
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- న్యూఢిల్లీ – ప్లాట్‌ఫారమ్ నం. 1
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- మధురై – ప్లాట్‌ఫారమ్ నం. 1 ఎగ్జిక్యూటివ్ లాంజ్- జైపూర్ – ప్లాట్‌ఫారమ్ నం. 1
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- ఆగ్రా – ప్లాట్‌ఫారమ్ నం. 1
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- అహ్మదాబాద్ – ప్లాట్‌ఫారమ్ నం. 1
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- వారణాసి – ప్లాట్‌ఫారమ్ నం. 1
  • ఎగ్జిక్యూటివ్ లాంజ్- సీల్దా – ప్లాట్‌ఫారమ్ నం. 1

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us