AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ ఇదిగో..

దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సమ్మర్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగ్గా.. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం స్పెషల్ రైళ్లను తిరుపతి వరకు ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.

Venkatrao Lella
|

Updated on: Jun 01, 2026 | 4:24 PM

Share
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యాసంస్థలకు వేసవి సెలవు కారణంగా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు. దీంతో రైళ్లల్లో రద్దీ పెరగ్గా.. దీనిని అనుగుణంగా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తాజాగా మరికొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

1 / 5
జూన్ 3వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ల వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్-నహర్లగున్(07046) రైలు జులై 3 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు, నహర్లగున్-సికింద్రాబాద్(07047) జులై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు, చర్లపల్లి-సంత్రగాచి(07221) జులై 4 నుంచి స్టెంబర్ 26 వరకు, సంత్రగాచి-సికింద్రాబాద్(07222) జులై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు, హైదరాబాద్-కొల్లాం(07093) రైలు జులై 4 నుంచి సెప్టెంబర్ 26 వరకు కొల్లాం-హైదరాబాద్(07194) జులై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది.

2 / 5
ఇక సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07425),  శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07426) జులై 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకు, జల్నా-తిరుపతి(07814) రైలు జులై 2 నుంచి సెప్టెంబర్ 24 వరకు, తిరుపతి-జల్నా(07815) జులై 3 నుంచి 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తన ప్రకటనలో తెలిపింది. సమ్మర్ కారణంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో వీటిని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది.

3 / 5
జల్నా-తిరుపతి ప్రత్యేక సర్వీసులు తిరుమల వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర నుంచి బయల్దేరనున్న ఈ రైళ్లు.. తెలంగాణ మీదుగా ఏపీకి వెళ్లనున్నాయి. తెలంగాణలోని బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఇవి ఆగుతాయి.

4 / 5
ఇక ఏపీ విషయానికొస్తే.. విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణగుంట, తిరుపతి స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి. వేసవి కావడంతో తిరుమలలో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో రైల్వే శాఖ తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది. ఇప్పుడు మరికొన్ని రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

5 / 5
Follow Us