కరెంట్‌ అవసరం లేదు.. ఖరీదైన గ్యాస్‌ ఖర్చులేదు.. ఇలాంటి వాటర్‌ హీటర్‌ ఉంటే చాలు.. ఏ ట్యాప్‌ తిప్పినా వేడి నీళ్లే..!

|

Oct 29, 2023 | 5:20 PM

ఇది నీటిని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. అందువల్ల పగటిపూట మంచి సూర్యకాంతి ఉంటే, రాత్రి, పగలు వేడినీరు అందుబాటులో ఉంటుంది.  కొన్ని సోలార్ వాటర్ హీటర్లలో కూడా బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. ఇది విద్యుత్, గ్యాస్ అప్షన్‌ కూడా ఉంటుంది. చాలా రోజులు సూర్యరశ్మి లేకపోతే నీరు వేడి చేయటానికి వీలుగా ఉంటుంది. అయితే, ఈ రకమైన సోలార్ వాటర్ హీటర్ ధర ఎక్కువగా ఉంటుందని గమనించండి.

కరెంట్‌ అవసరం లేదు.. ఖరీదైన గ్యాస్‌ ఖర్చులేదు.. ఇలాంటి వాటర్‌ హీటర్‌ ఉంటే చాలు.. ఏ ట్యాప్‌ తిప్పినా వేడి నీళ్లే..!
Solar Water Heater
Follow us on

చలికాలం మొదలైంది. మారుతున్న వాతావరణంతో చాలా మందికి ఉదయాన్నే ఇంట్లో వేడి నీళ్లు అవసరం. పెరిగిపోయిన గ్యాస్‌ ధరలు, కరెంటు బిల్లుల కారణంగా వేడి నీళ్లు ఎక్కువగా వాడాలంటే.. చాలా మంది భయపడిపోతుంటారు..ఈ నేపథ్యంలోనే వేడి నీటికి ఒక పరిష్కారం దొరికింది. దాని సహాయంతో మీరు మీ ఇంట్లోని ప్రతి నళ్లా నుం ఇన్స్టాల్ చేసిన ప్రతి ట్యాప్లో వేడి నీటిని పొందగలుగుతారు. అది సోలార్ వాటర్ హీటర్.. సోలార్ వాటర్ హీటర్ సహాయంతో మీరు ఇంట్లో అన్ని సమయాలలో వేడి నీటిని పొందగలుగుతారు. దీంతో మీకు విద్యుత్తు ఖర్చు కూడా ఉండదు. ఖరీదైన గ్యాస్ సిలిండర్లను ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు.

సోలార్ వాటర్ హీటర్ ఎలా పని చేస్తుంది?

సోలార్ వాటర్ హీటర్‌లో స్టోరేజీ ట్యాంక్, సోలార్ కలెక్టర్లు ఉంటాయి. సోలార్ కలెక్టర్ నీటిని వేడి చేయడానికి పనిచేస్తుండగా, స్టోరేజ్‌ ట్యాంక్‌ నీటిని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. ఇవి మార్కెట్‌లో వివిధ సామర్థ్యాలలో అందుబాటులో లభిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సోలార్ వాటర్ హీటర్ ధర ..

సోలార్ వాటర్ హీటర్‌ను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లేదా స్థానిక మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో రూ. 18000 ధరతో మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ ధర 100 లీటర్ల సామర్థ్యం కలిగిన 1 యూనిట్‌కు. మార్కెట్‌లో సోలార్ వాటర్ హీటర్‌లను విక్రయించే అనేక బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. వాటిలో హావెల్స్, వి గార్డ్ మొదలైనవి ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

సోలార్‌ వాటర్‌ హీటర్‌తో ఎలాంటి ప్రమాదం ఉండదు..

ఇంట్లో సోలార్ వాటర్ హీటర్‌ను అమర్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, దీని కోసం మీరు ఎక్కడా ఎలాంటి కూల్చివేతలు వంటివి చేయనవసరం లేదు. అదనంగా, ఇది మీ విద్యుత్ బిల్లును కూడా ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదు.

ఎల్లప్పుడూ వేడి నీరు ఉంటుందా..?

సోలార్ వాటర్ హీటర్ గురించి కొందరు ఇలాంటి సందేహాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇది రాత్రిపూట కూడా వేడి నీటిని అందించగలదా? అంటే. బేషుగ్గా అని చెప్పాలి..ఎందుకంటే.. సోలార్ వాటర్ హీటర్ లోపల మంచి నాణ్యమైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది నీటిని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. అందువల్ల పగటిపూట మంచి సూర్యకాంతి ఉంటే, రాత్రి, పగలు వేడినీరు అందుబాటులో ఉంటుంది.  కొన్ని సోలార్ వాటర్ హీటర్లలో కూడా బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. ఇది విద్యుత్, గ్యాస్ అప్షన్‌ కూడా ఉంటుంది. చాలా రోజులు సూర్యరశ్మి లేకపోతే నీరు వేడి చేయటానికి వీలుగా ఉంటుంది. అయితే, ఈ రకమైన సోలార్ వాటర్ హీటర్ ధర ఎక్కువగా ఉంటుందని గమనించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..