AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాయ లేదు మంత్రం లేదు.. ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్

మంచి జీతం అందుకున్నప్పటికీ, దుబారా ఖర్చుల వల్ల నెలాఖరుకు అప్పులు చేస్తుంటారు కొంతమంది. బయట భోజనం, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వేరియబుల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మరికొన్ని ఖర్చులను పూర్తిగా కట్‌ చేస్తేనే డబ్బులు మిగులుతాయి. మరి ఆ ఖర్చులేంటో ఇప్పుడు చూద్దాం..

మాయ లేదు మంత్రం లేదు.. ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
Final Settlement
SN Pasha
|

Updated on: Jan 13, 2026 | 5:27 PM

Share

కొంతమంది మంచి జీతానికి ఉద్యోగం చేస్తుంటారు. ఠంచనుగా ఒకటో తేదీనే ఐదెంకల జీతం అందుకుంటారు. కానీ నెలాఖరుకు వచ్చేసరికి అప్పులు చేస్తుంటారు. అందుకు కారణం కొన్ని దుబారా ఖర్చులు కారణం కావొచ్చు. బయట తినడం, ఆహారం డెలివరీ చేయడం, హఠాత్తుగా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ఇవి వేరియబుల్ ఖర్చులు. వీటిని తగ్గించడం వల్ల వెంటనే మీ చేతిలో డబ్బు కనిపిస్తుంది కానీ, వాటిని మళ్లీ ప్రారంభిస్తే మునుపటి పరిస్థితే మళ్లీ వస్తుంది. అలా కాకుండా కచ్చితంగా కొన్ని ఖర్చులను కట్‌ చేస్తే మీ జేబు ఎప్పుడూ డబ్బుతో కళకళలాడుతూ ఉంటుంది.

ఇవి చేయండి..

స్ట్రీమింగ్ సర్వీస్‌లు, యాప్‌లు, ప్రీమియం మెంబర్‌షిప్‌లు, మీరు అరుదుగా ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్. విడివిడిగా, అవి చిన్నవిగా కనిపిస్తాయి. కానీ అన్ని కలిపితే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ప్రయాణాలు. విచక్షణతో కూడిన విహారయాత్రలను వాయిదా వేయడంతో కూడా మీరు డబ్బు ఆదాయ చేయొచ్చు.

EMI చెల్లించడంలో అస్సలు ఆలస్యం చేయకండి. వాటిని కట్టకంటే అదనపు వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే EMIలు సకాలంలో కట్టేయండి. క్రెడిట్ కార్డులపై కనీస బకాయిలను మాత్రమే చెల్లించకుండా పూర్తిగా క్లియర్‌ చేసే ప్రయత్నం చేయండి. వడ్డీ రూపంలో చాలా డబ్బు సేవ్‌ అవుతుంది. అలాగే ఏ ప్రీమియం వస్తువు కొనే ముందు అయినా సరే కచ్చితంగా అది అసవరమా లేదా అని ఒకటి పది సార్లు ఆలోచించండి. కచ్చితంగా అసవరం అయితేనే కొనండి. లేదంటే తర్వాత కొందాలనే అని వాయిదా అయినా వేయండి.

అలాగే ఆర్థిక ఇబ్బందుల ఉన్నాయి కదా అని పెట్టుబడులు పెట్టడం మానేయకండి. స్వల్ప కాలిక ఇబ్బందులను తీర్చుకోవడానికి దీర్ఘకాల ప్రయోజనాలను దెబ్బతీయకూడదు. ఉదాహరణకు మీరు ప్రతినెలా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా కొంత పొదుపు చేస్తుంటే ఇతర అవసరాల కోసం వాటిని ఉపయోగించకండి. దీని వల్ల మనకు భవిష్యత్తులో అంతగా ఉపయోగం లేదో దానిపై ఖర్చు తగ్గించండి. అంతేకానీ భవిష్యత్తులో ఆదుకునే పొదుపులను మాత్రం నిలిపివేయకండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?