AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skill india: సీనియర్ల సిటిజన్లకూ నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు పెంచడమే ధ్యేయం

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులు, పని విధానాలు మారుతున్నాయి. ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

Skill india: సీనియర్ల సిటిజన్లకూ నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు పెంచడమే ధ్యేయం
Skill India
Nikhil
|

Updated on: Dec 09, 2024 | 4:15 PM

Share

పెరుగుతున్న సాంకేతికతను అనుగుణంగా వివిధ రకాల కోర్సులు చేస్తున్నారు. వారికి చదువు పూర్తవగానే అవకాశాలు ఉంటున్నాయి. కానీ సీనియర్ సిటిజన్ల పరిస్థితి ఏమిటి. ఈ టెక్నాలజీ యుగంలో వారికి తెలిసిన పని సరిపోదు, ఉపాధి లభించదు. అందుకునే సీనియర్ సిటిజన్లకు కూడా ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో దేశ అవసరాలు తీరడం ప్రధాన ధ్యేయం. దీనితో పాటు దేశంలోని సీనియర్ సిటిజన్లకు ఉపాధి కల్పించడం. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ లో స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (ఎస్ఐడీహెచ్) ను ప్రారంభించారు. దేశంలో విద్య, ఉపాధి, నైపుణ్యాలను పెంచే డిజిటల్ వేదిక అని చెప్పవచ్చు.

స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ద్వారా స్కీల్ ఇండియా డిజిటల్ హబ్ (ఎన్ఐడీహెచ్)ను ప్రారంభించారు. దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 505 జిల్లాలకు చెందిన 4,799 మంది సీనియర్ అభ్యాసకులు దీనిలో నమోదయ్యారు. వీరందరూ ఎంఎల్, ఏఐ, బిగ్ డేటా, వేద్ తదితర కోర్సులు చదువుతున్నారు. శిక్షణలో భాగంగా 50 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు ఇండస్ట్రీ 4.0 కోర్సులను అందజేస్తున్నారు. వెబ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, కిసాన్ డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులకు బయట ఆదరణ కూడా చాలా బాగుంది. ఎక్కువ మంది వీటిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అసోంలోని జోర్హాట్ కు చెందిన పార్థ బారుహ్ వ్యవసాయం చేస్తుంటాడు. అలాగే ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. 51 ఏళ్ల వయసున్న ఈయన కిసాన్ డ్రోన్ ఆపరేటర్ కోర్సులో చేరాడు. దీనివల్ల వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటించే అవకాశం ఉంటుంది. మరికొందరు శిక్షణ కూడా ఇవ్వగలడు. అలాగే డ్రోన్ ను ఆపరేటింగ్ చేయడం ద్వారా అసోంలోని వివిధ అందమైన ప్రాంతాలను చిత్రీకరణ చేయగలుగుతున్నాడు. అతడి ట్రావెల్ ఏజెన్సీనికి కూడా ప్రోత్సాహం లభిస్తోంది.

ప్రఫుల్లా రావత్ కు 55 ఏళ్లు. రాజస్థాన్ లోని ఐటీఐలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన స్వతహాగా ఫీల్డ్ టెక్నీషియన్. ఎస్ఐడీహెచ్ లో చేరిన తర్వాత తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. తద్వారా తన విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్నాడు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ కు సంజీవ్ నిగమ్ కు 54 ఏళ్లు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న గూగుల్ క్లౌడ్ జనరేటివ్ ఏఐ కోర్సులో చేరి, నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు ఏఐ పై విద్యార్థులకు పాఠాలు చెప్పగలుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి