SIP: పెట్టుబడిదారుల చూపు ఎస్ఐపీ వైపు.. ఒక్క నెలలోనే ఏకంగా రూ. 23వేల కోట్లు.. ఎందుకింత డిమాండో తెలుసా?

మన దేశంలో పెట్టుబడిదారులకు ఏకైక బెస్ట్ ఆప్షన్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(ఎస్ఐపీ). అవునండి మార్కెట్లో ఎన్నిరకాల పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నా.. ఇన్వెస్టర్లు చూపు కేవలం ఎస్ఐపీలపై ఉంది. దీనికి 2024 జూలై గణాంకాలే నిదర్శనం. ఈ నెలలో ఎస్ఐపీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా రూ.23,331.75 కోట్లను కేవలం ఎస్ఐపీలోనే పెట్టబడిదారులు పెట్టారు. ఇందుకు గల కారణాలను తెలుసుకుందాం రండి.

SIP: పెట్టుబడిదారుల చూపు ఎస్ఐపీ వైపు.. ఒక్క నెలలోనే ఏకంగా రూ. 23వేల కోట్లు.. ఎందుకింత డిమాండో తెలుసా?
Systematic Investment Plan(sip)
Follow us

|

Updated on: Sep 07, 2024 | 9:57 PM

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒకప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే వాటి వైపు చూసే వారు. దానికి ప్రధాన కారణం అవి మార్కెట్ రిస్క్ నకు లోనవుతాయి. కచ్చితమైన రాబడి ఉండదు. ఒకేసారి పెట్టుబడి పెట్టవలసి రావడంతో ఆందోళన చెందే వారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(ఎస్ఐపీ)లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటికి డిమాండ్ ఏర్పడింది. క్రమశిక్షణతో కూడిన విధానం, నష్టం లేని రాబడి అందిస్తుండటంతో అందరూ వీటివైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకపోయినా, షేర్ల గురించి అవగాహన లేకపోయిన పలు ఆన్ లైన్ ప్లాట్ ఫారంలు అన్నీ చేసేస్తుండటంతో వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మన దేశంలో అనుభవం లేని పెట్టుబడిదారులు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ మొత్తం ఎంత ఉంది అంటే.. 2024 జూలైలోని ఎస్ఐపీ కంట్రిబ్యూషన్లును గమనిస్తే ఏకంగా రూ.23,331.75 కోట్లకు పెరిగి కొత్త రికార్డులు సృష్టించాయి. మరి ఇంతలా ఎస్ఐపీలకు డిమాండ్ పెరగడానికి కారణాలు ఏమిటి? పెట్టుబడిదారులు ఎస్ఐపీలకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? అందుకు గల కారణాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

కారణమిదేనా?

ఎస్ఐపీలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అందుకు గల ప్రధాన కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

క్రమశిక్షణ, స్థిరత్వం: ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమబద్ధంగా పెట్టుబడులు పెడతాయి. క్రమశిక్షణతో కూడిన పొదుపు, పెట్టుబడి అలవాట్లను ప్రోత్సహిస్తాయి. పెట్టుబడిదారులు క్రమమైన వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని అందజేస్తాయి. ఇది కాలక్రమేణా స్థిరంగా సంపదను నిర్మించడంలో సహాయపడుతుంది.

రూపీ కాస్ట్ ఏవరేజింగ్: ఎస్ఐపీలు రూపాయి ఖర్చు సగటు(రూపీ కాస్ట్ ఏవరేజింగ్) నుంచి ప్రయోజనం పొందుతాయి. ఇక్కడ పెట్టుబడులు వివిధ మార్కెట్ ఫోర్ట్ ఫోలియోల్లో విస్తరిస్తాయి. ఇది మార్కెట్ అస్థిరత, ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొనుగోలు చేసిన యూనిట్ల ధరను సగటున తగ్గించగలగుతుంది. ఇది మెరుగైన దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది.

కాంపౌండింగ్ ప్రయోజనాలు: రెగ్యులర్ ఎస్ఐపీలు పెట్టుబడులు కాంపౌండింగ్ అవుతుంటాయి. వచ్చిన రాబడిని మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా చిన్న, స్థిరమైన కంట్రిబ్యూషన్లు కూడా కాలక్రమేణా గణనీయంగా పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టిస్తుంది.

ఫ్లెక్సిబులిటీ: ఎస్ఐపీలు పెట్టుబడిదారులను తక్కువ మొత్తంతో ప్రారంభించటానికి అనుమతిస్తాయి. ఇది అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ మంది దీనిలో చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఏర్పడుతుంది.

పెట్టుబడి సౌలభ్యం: ఎస్ఐపీలు సెటప్ చేయడానికి, నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పెట్టుబడిదారులు తమ సహకారాన్ని బ్యాంక్ ఆదేశాల ద్వారా ఆటోమేట్ చేయవచ్చు. ఇది మాన్యువల్ లావాదేవీల అవసరాన్ని తొలగిస్తుంది. తరచుగా పర్యవేక్షించాల్సిన అవసరం లేకుండా స్థిరమైన పెట్టుబడిని నిర్ధారిస్తుంది.

వీటి గురించి తెలుసుకోవాలి..

ఎస్ఐపీలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, పరిగణించవలసిన సంభావ్య నష్టాలు, లోపాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మార్కెట్ రిస్క్.. ఎస్ఐపీలు సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి. పేలవమైన మార్కెట్ పనితీరు తక్కువ రాబడికి లేదా నష్టాలకు కూడా దారి తీసే అవకాశం ఉంది.

కచ్చితమైన రాబడి ఉండదు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా రాబడికి కచ్చితమైన హామీనిచ్చే పెట్టుబడి సాధనాల వలె కాక.. ఎస్ఐపీ స్థిరమైన రాబడికి హామీ ఇవ్వవు. రాబడులు మ్యూచువల్ ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి.

ఫీజులు, ఛార్జీలు.. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ రుసుములు, నికర రాబడిని ప్రభావితం చేసే ఇతర ఖర్చులను కలిగి ఉంటాయి. అధిక రుసుములు కాలక్రమేణా లాభాలను తగ్గిస్తాయి.

ఓవర్ ఎక్స్‌పోజర్.. ఎస్ఐపీల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టడం వల్ల నిర్దిష్ట రంగాలు లేదా ఫండ్‌లలో అధిక ఎక్స్‌పోజర్‌కు దారితీయవచ్చు. మార్కెట్ పరిస్థితులు మారితే రిస్క్ పెరుగుతుంది.

మానసిక ప్రభావం.. ఈ ఎస్ఐపీలు దీర్ఘకాలికంగా మంచి రాబడినిచ్చినా.. స్వల్పకాలికంగా మార్కెట్ ఒడిదొడుకుల ఆధారంగా హెచ్చుతగ్గులతో పెట్టుబడిదారులు ఆందోళన చెందే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడిదారులు మధ్యలోనే తమ ఎస్ఐపీలను ఆపడానికి లేదా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు