PAN Card: నిమిషాల్లో ఈ-పాన్ కార్డు వచ్చేస్తుంది.. ఇలా ట్రై చేయండి.. చాలా సింపుల్..
పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇది పది అంకెలు, అక్షరాలతో కూడిన ప్రత్యేకమైన నంబర్. ఈ పాన్ కార్డును పొందాలంటే ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భౌతికంగా కార్డును పొందాలంటే దాని ప్రింటింగ్, పోస్టేజ్, మాన్యువల్ హ్యాండ్లింగ్ లకు సమయం పడుతుంది. అయితే అత్యవసరంగా కార్డు కావాలంటే ఇబ్బందే. అందుకే ఈ-పాన్ విధానాన్ని తీసుకొచ్చారు.
మన దేశంలో పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆధార్ కార్డు ఎలా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందో.. అదే విధంగా పాన్ కార్డు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో అదే విధంగా ఉపయోగపడుతుంది. పాన్ కార్డు లేకుండా బ్యాంకు ఖాతాలు ప్రారంభించలేరు. ఏ ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు ఉండాల్సిందే. ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా పాన్ కార్డుకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు అయితే పాన్ కార్డు మరింత కచ్చితంగా ఉపయోగించాల్సిందే. అది లేకపోతే పన్ను ప్రయోజనాలు పొందలేరు. ఈ పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. ఇది పది అంకెలు, అక్షరాలతో కూడిన ప్రత్యేకమైన నంబర్. ఈ పాన్ కార్డును పొందాలంటే ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భౌతికంగా కార్డును పొందాలంటే దాని ప్రింటింగ్, పోస్టేజ్, మాన్యువల్ హ్యాండ్లింగ్ లకు సమయం పడుతుంది. అయితే అత్యవసరంగా కార్డు కావాలంటే ఇబ్బందే. అందుకు ఈ-పాన్ విధానాన్ని తీసుకొచ్చారు. డిజిటల్ విధానంలో కార్డులు పొందుకోవచ్చు. నిమిషాల్లో కార్డు మీకు వచ్చేస్తుంది. ఆ పక్రియ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
ఈ-పాన్ సదుపాయం వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే అందుకు చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ అవసరం. దీని సాయంతో దరఖాస్తుదారులు తక్షణమే పాన్ కార్డులను పొందొచ్చు. పీడీఎఫ్ ఫార్మేట్లో ఇది జారీ అవుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా దానిని డిజిటల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ-పాన్ అనేది ఆధార్ నుంచి ఈ-కేవైసీ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్‌గా డిజిటల్ సంతకం చేసిన పాన్ కార్డ్.
ఈ-పాన్ ప్రయోజనాలు ఇవి..
- ఇది సులభమైన, కాగితం రహిత ప్రక్రియ
- మీకు కావలసిందల్లా ఆధార్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్
- ఈ-పాన్ కార్డులు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం, కేవైసీ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
- ఒరిజినల్ పాన్ కార్డువలే అన్ని అవసరాలకు ఈ-పాన్ ను వాడుకోవచ్చు.
ఈ-పాన్ కార్డ్‌ని ఎవరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
తక్షణ ఈ-పాన్ సేవ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంది. ఆధార్ నంబర్ తో ఈ-పాన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్‌గా సంతకం చేసిన పాన్‌ను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉచితంగా తీసుకోవచ్చు.
ఈ-పాన్ ఎలా పొందాలంటే..
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి .
- ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, ఇన్ స్టంట్ ఈ-పాన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఈ-పాన్ పేజీలో, గెట్ న్యూ ఈ-పాన్ ఆప్షన్ ను ఎంచుకోండి.
- గెట్ న్యూ ఇ-పాన్ పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, చెక్‌బాక్స్‌ని క్లిక్ చేసి, కంటిన్యూపైక్లిక్ చేయండి.
- ఆధార్ లింక్ అయి ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, చెక్ బాక్స్ పై క్లిక్ చేసి నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూపై నొక్కాలి. ఆ తర్వాత సబ్మిట్ నొక్కాలి.
- రసీదు సంఖ్యతో సహా విజయవంతమైన సందేశం మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. భవిష్యత్తు సూచన కోసం ఈ అక్నాలెడ్జ్‌మెంట్ ఐడీని అలాగే ఉంచుకోండి. అదనంగా, ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..