సింగరేణి సంస్థ కొత్త నినాదం.. ఏంటో తెలుసా !

సింగరేణి సంస్థ కొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. "విదేశీ బొగ్గు వద్దు.. స్వదేశీ బొగ్గు ముద్దు" అంటోంది. ఇదే అర్థం వచ్చేలా తమ అధికారిక వెబ్‌ సైట్‌ లో ఒక ప్రత్యేక పోర్టల్‌ ను ప్రవేశపెట్టింది.

సింగరేణి సంస్థ కొత్త నినాదం.. ఏంటో తెలుసా !
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 7:32 PM

సింగరేణి సంస్థ కొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. “విదేశీ బొగ్గు వద్దు.. స్వదేశీ బొగ్గు ముద్దు” అంటోంది. ఇదే అర్థం వచ్చేలా తమ అధికారిక వెబ్‌ సైట్‌ లో ఒక ప్రత్యేక పోర్టల్‌ ను ప్రవేశపెట్టింది. ఆ సంస్థ డైరెక్టర్‌ బి.భాస్కర్‌ రావు, డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ దీనిని ప్రారంభించారు. విదేశీ బొగ్గు వినియోగం తగ్గించడానికి ప్రత్యమ్నాయంగా స్వదేశీ బొగ్గు వాడకాన్ని పెంచడం కోసం, వినియోగదారులకు అనుకూలమైన, స్నేహపూర్వకమైన ఫ్రెండ్లీ బిజినెస్ కోసం ఈ పోర్టల్‌ ను ప్రారంభించామని వారు ప్రకటించారు. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం బాగా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సింగరేణిలో గల రైల్‌, రోడ్‌ లోడింగ్ పాయింట్లలో ఎక్కడినుండి అయినా సరే బొగ్గు పొందడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తున్నామని డైరెక్టర్లు ప్రకటించారు. సింగరేణి సంస్థ వినియోగదారుల కోరిక మేరకు నాణ్యతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, వారికి కావాల్సిన పరిమాణంలో బొగ్గును సరఫరా చేయడానికి సంసిద్ధంగా ఉందన్నారు.