2.8 లక్షలకు పైగా ఉద్యోగాలుః అమిత్‌షా
కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. ప్రపంచంలోనే భారత్‌ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,.ఆదివాసీ, గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ ద్వారా దేశంలో 2.8 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అలాగే, రూ. 33,000 కోట్ల పెట్టుబడులు సమకూరడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ. 20,000 కోట్ల రాబడి వస్తుందని తెలిపారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు ఉత్పత్తులు పెరగడంతో పాటు, ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు కేంద్రం పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళుతోందన్నారు.
గురువారం 41 బొగ్గు గనుల వేలాన్ని మోదీ ఈ రోజు ప్రారంభించారు. పైవేట్ బొగ్గు గనుల ద్వారా ఆదివాసీ, గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కోల్ సెక్టార్‌లో పైవేట్ పెట్టుబడులు అతిపెద్ద సంస్కరణగా వెూదీ అభివర్ణించారు. ఇకపై కోల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెప్పారు. దేశంలో 41 బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.33వేల కోట్ల మూల ధన పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్తగా 2.8లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.