Credit score: క్రెడిట్ స్కోర్ పరుగులు పెట్టాలా..? ఈ పద్ధతులు పాటించాల్సిందే..!
జీవితంతో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రణాళిక చాలా అవసరం. దాని సక్రమంగా అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రణాళికలో భాగంగా క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడం అత్యంత కీలకం. ఆ స్కోర్ బాగున్నప్పుడే బ్యాంకుల నుంచి త్వరగా, తక్కువ వడ్డీకి రుణాలు మంజూరవుతాయి. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు మీకు ధీర్ఘకాలంలో లాభం కలుగుతుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు.
జీవితంతో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రణాళిక చాలా అవసరం. దాని సక్రమంగా అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రణాళికలో భాగంగా క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడం అత్యంత కీలకం. ఆ స్కోర్ బాగున్నప్పుడే బ్యాంకుల నుంచి త్వరగా, తక్కువ వడ్డీకి రుణాలు మంజూరవుతాయి. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు మీకు ధీర్ఘకాలంలో లాభం కలుగుతుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. అలాగే స్థిరాస్థిని కొనుగోలు చేసినప్పుడు కూడా బ్యాంకులను రుణాల కోసం ఆశ్రయించినప్పుడు క్రెడిట్ స్కోర్ చాలా కీలకంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవాలి. అత్యవసరం సమయంలో రుణాలను తీసుకున్నప్పుడు మీకు చాలా సహాయంగా ఉంటుంది. మీ ఖాతాకు సంబంధించిన తాజా కార్యాచరణను క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. కానీ మీరు ఇప్పటికే క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉంటే నెలకు ఒకసారి దానిలో మార్పులను చూసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి నిపుణులు చెప్పే చిట్కాలను తెలుసుకుందాం.
సకాలంలో బిల్లుల చెల్లింపు
క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇతర ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. ఒక వాయిదా తప్పినా దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. విశ్వసనీయ క్రెడిట్ స్కోర్ యాప్‌ను ఉపయోగించి మీ చెల్లింపుల చరిత్రను తనిఖీ చేయవచ్చు.
లోపాల గుర్తింపు
మీ క్రెడిట్ ఖాతాలకు సంబంధించిన ఏవైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించాలి. ఇందుకు మీ క్రెడిట్ నివేదిక ఎంతో సహాయ పడుతుంది. మీకు తెలియకుండా మీ పేరుతో లోన్ ఉండవచ్చు. క్రెడిట్ కార్డు మంజూరయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పటి కప్పుడు పరిశీలన చేసుకోవడం ద్వారా అలాంటి సమస్యలుంటే గుర్తించి, పరిష్కరించుకోవచ్చు.
ట్రాక్ చేయడం
క్రెడిట్ వినియోగాన్ని ట్రాక్ చేయడం చాలా కీలకం. మీరు ఉపయోగించిన క్రెడిట్ పరిమితి శాతం 30 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి ఆ శాతం దాటకుండా కార్డులను వినియోగించుకోవాలి.
వ్యూహాత్మక చెల్లింపులు
మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి చెల్లించే బదులు, నెలలో అనేక సార్లు చిన్నగా చెల్లింపులు చేయాలి. మీ కార్డులో అందిస్తున్న ఆఫర్లకు వినియోగించుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
క్రెడిట్ పరిమితిని పెంచుకోవాలి
క్రెడిట్ పరిమితి పెరిగితే అది వినియోగ నిష్పత్తిని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు.. మీ పరిమితి రూ.లక్ష నుంచి లక్షన్నరకు పెరిగింది. కానీ మీరు కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అప్పుడు మీ వినియోగనిష్పత్తి 30 శాతం నుంచి 20 శాతానికి పడిపోతోంది. తద్వారా స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంది.
సొంత కార్డు పొందాలి
మీరు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు మీ క్రెడిట్ యాక్టివిటీ అంతా ప్రాథమిక కార్డు హోల్డర్ ఖాతాలో కనిపిస్తుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే సొంత కార్డును పొందడం చాాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..