Ola Scooter: ఓలాపై విరక్తి! భరించలేక కస్టమర్ ఏం చేశాడంటే..
స్కూటర్లు నాణ్యంగా ఉండటం లేదని, సర్వీస్ సక్రమంగా చేయడం లేదని, కంపెనీ నుంచి స్పందన సరిగ్గా ఉండటం లేదని ఏకంగా నిరసనలు చేసిన ఘటనలు మన హైదరాబాద్లో కూడా జరిగాయి. అయినప్పటికీ ఓలా యాజమాన్యం మారడం లేదు. ఇప్పుడు మరో ఓలా కస్టమర్ తన నిరసనను వినూత్న విధానంలో తెలిపాడు.

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా రూపొందిస్తే.. దానిలో ఒకటి రెండు స్థానాల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తప్పనిసరిగా ఉంటాయి. అంతలా అవి జనాదరణ పొందాయి. వాటిల్లో ఉండే ఫీచర్లు, అత్యాధునిక సాంకేతిక అమితంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో దీనికి పూర్తి విరుద్ధంగా ఓలా కంపెనీ నడుస్తోంది. వినియోగదారుల నుంచి విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. స్కూటర్లు నాణ్యంగా ఉండటం లేదని, సర్వీస్ సక్రమంగా చేయడం లేదని, కంపెనీ నుంచి స్పందన సరిగ్గా ఉండటం లేదని ఏకంగా నిరసనలు చేసిన ఘటనలు మన హైదరాబాద్లో కూడా జరిగాయి. అయినప్పటికీ ఓలా యాజమాన్యం మారడం లేదు. ఇప్పుడు మరో ఓలా కస్టమర్ తన నిరసనను వినూత్న విధానంలో తెలిపాడు. ఏడాదిగా విసిగి వేసారిన ఆ కస్టమర్ ఓలా స్కూటర్ ను రిక్షా ఎక్కించి, ఓలా షోరూం వద్ద నిలబడి ఓ పేరడీ పాట పాడుతూ నిరసన తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వీడియో వైరల్..
ఏడాది క్రితం ఓలా స్కూటర్ కొనుగోలు చేసిన సాగర్ సింగ్ అనే వ్యక్తి.. పాడైపోయి కదలకుండా ఉన్న ఓలా స్కూటర్ రిక్షా తీసుకొచ్చి ఓలా షోరూం వద్ద ఉంచి, బాలీవుడ్ పాట, ‘తడప్ తడప్’ సాంగ్ కు పేరడీగా ‘టూట్ గయే హమ్ ఓలా లేకర్ కే’(మనం ఓలా చేతుల్లో మోసపోయాం) అని పాడాడు. ఏకంగా మైక్ పట్టుకుని స్పీకర్లు పెట్టుకుని ఈ ప్రదర్శన చేయడంతో ఒక్కసారిగా ఆ షోరూం ఎదుట జనాలు గుమిగూడారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియనప్పటికీ సోమవారం(ఆగస్టు 19) సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అప్పటి నుంచి విపరీతంగా రీపోస్ట్ అవుతోంది. షేరింగ్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోయింది.
వీడియో చూడండి..
View this post on Instagram
ఎవరు షేర్ చేశారంటే..
ఎక్స్(ట్విట్టర్) వినియోగదారుడైన పంకజ్ పరేజ్ ఈ నిరసన వీడియోను షేర్ చేశారు. ‘సాగర్ సింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొని ఇబ్బందులు పడుతున్నాడు. ఏడాది కాలంగా స్కూటర్లో ప్రతి రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. పైగా ఓలా ఎలాంటి సర్వీస్ ను అందించడం లేదు. అందుకే సాగర్ ఇలా స్కూటర్ ను రిక్షాపై ఉంచి పాట పాడి నిరసన తెలిపాడు’ అంటూ పోస్ట్ లో రాశారు. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్టు కింద ఆసక్తికరంగా ఉన్న కొన్ని కామెంట్లను మీకు అందిస్తున్నాం..
- ‘పర్ఫెక్ట్.. ఓలాకు ఇలానే జరగాలి. సర్వీస్ సెంటర్ సరిగ్గా స్పందించడం లేదు. రెండు నెలలుగా నా స్కూటర్ కూడా ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది.’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
- ‘పాట చాలా బాగా పాడారు. ఓలా ఇప్పటికైనా మారుతందని భావిస్తున్నా. కస్టమర్లకు సరైన సేవలు అందించడంలో కంపెనీ ఘోరంగా విఫలం అవుతోంది.
- ‘దీని బదులు మరో వాహనం కొనుగోలు చేసుకోవడం బెటర్..’ అని ఒకరు, ‘ధర ఎక్కువ.. పని తక్కువ’ అని మరొకరు.. ‘ఇటీవల కాలంలో నిరసనను తెలపడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..