Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. పతనమైన గ్యాస్, ఆయిల్‌, మెటల్, బ్యాంక్‌ స్టాక్స్‌..

మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది...

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. పతనమైన గ్యాస్, ఆయిల్‌, మెటల్, బ్యాంక్‌ స్టాక్స్‌..
Stock Market
Follow us

|

Updated on: Jun 22, 2022 | 9:58 AM

మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఆసియా స్టాక్‌లలో బలహీనతను ట్రాక్ చేయడం, ఓపెనింగ్ డీల్స్‌లో అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై నిరంతర ఆందోళనల మధ్య ఆసియా షేర్లు ఈరోజు అస్థిరలో కొనసాగుతోన్నాయి. ఉదయం 9:50 గంటలకు బీఎస్‌ సెన్సెక్స్ 527 పాయింట్లు నష్టపోయి 52,016 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 318 పాయింట్లు పతనమై 15,477 వద్ద కొనసాగుతోంది. మిడ్‌ క్యాప్‌ 0.92, స్మాల్‌ క్యాప్‌ 0.86 శాతం పడిపోయాయి.

సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ మెటల్ 2.75, నిఫ్టీ ఆయిల్‌&గ్యాస్ 2.24, నిఫ్టీ బ్యాంక్‌ 0.85 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో టాప్‌ లూజర్‌గా హిందుల్కో కొనసాగుతోంది. ఈ స్టాక్‌ 4.54 శాతం నష్టపోయి రూ.323.85 వద్ద ట్రేడవుతోంది. దీంతో పాటు ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, యూపీఎల్‌ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఫైనాన్స్, ఇండసండ్‌ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇందుస్థాన్‌ యూనిలివర్‌, డా. రెడ్డీస్, మారుతి, టీసిఎస్‌ లాభాల్లో కొనసాగుతోన్నాయి.