AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Payments: ఇక సైబర్ మోసాలకు చెక్… డిజిటల్ చెల్లింపుల సేఫ్టీకి ఎన్‌పీసీఐ సూచనలు!

డిజిటల్ చెల్లింపులు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. కోట్లాది మంది తమ రోజువారీ లావాదేవీలను వేగంగా, సులభంగా పూర్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే, డిజిటల్ చెల్లింపుల వాడకం పెరుగుతున్న కొద్దీ, వాటి భద్రత పట్ల అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. సురక్షితమైన చెల్లింపు పద్ధతులను పాటించడం ద్వారా మీ డిజిటల్ అనుభవం సురక్షితంగా ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేయడానికి NPCI అందించిన 5 ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం

Digital Payments: ఇక సైబర్ మోసాలకు చెక్... డిజిటల్ చెల్లింపుల సేఫ్టీకి ఎన్‌పీసీఐ సూచనలు!
Online Payment Ncpi Guidelines
Bhavani
|

Updated on: Jul 15, 2025 | 7:37 PM

Share

డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను వేగవంతం, సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారులలో అవగాహన పెరగాలి. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం సులభమే, ఇవి దీర్ఘకాలంలో మీకు డిజిటల్ అనుభూతిని భద్రంగా ఉంచుతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరపడానికి 5 చిట్కాలను సూచిస్తోంది.

1. చెల్లించే ముందు ఓసారి సరిచూడండి:

ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్‌పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయండి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో, ఆ పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోండి. చెల్లింపును నిర్ధారించడానికి కొన్ని సెకన్ల సమయం తీసుకోండి. తొందరపడి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.

2. నమ్మకమైన యాప్‌లు, వెబ్‌సైట్లనే వాడండి:

ఎప్పుడూ అధికారికమైన, పేరున్న యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపండి. మీకు తెలియని వారు, నమ్మకం లేని వారు పంపే లింకుల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. అటువంటి లింకులను క్లిక్ చేయకండి.

3. పిన్ లేదా ఓటీపీని ఎవరికీ చెప్పకండి:

మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, గోప్యమైనవి. మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా చెప్పినా సరే, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.

4. హడావిడిగా పేమెంట్ చేయవద్దు:

వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే, వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.

5. పేమెంట్ అలర్ట్‌లను ఆన్ చేసుకోండి:

మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్‌లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్‌ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్‌ను సంప్రదించండి.

ఈ అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ డిజిటల్ భద్రతను సొంతంగా చూసుకోగలరు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా మారుతాయి. అనుమానాస్పద నంబర్లు కనిపించినప్పుడు వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsaathi.gov.in/sfc/) ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే, దర్యాప్తుకు సహాయపడటానికి మెసేజ్‌లను సేవ్ చేసుకోండి, స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి, సంభాషణలను నమోదు చేయండి.

ఎన్‌ఎస్‌ఈలో విద్యుత్ ఫ్యూచర్స్ ప్రారంభం..

ఇండియా – నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) భారత విద్యుత్ డెరివేటివ్స్ మార్కెట్‌ అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. విజయవంతంగా నెలవారీ విద్యుత్ ఫ్యూచర్స్ (ELECMBL) కాంట్రాక్టులను ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ సోమవారం ప్రకటించింది.

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది