AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks: ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్.. రూల్స్ మార్చిన బ్యాంకులు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా తమ రోజువారీ లావాదేవీల సేవల్లో కొన్ని మార్పులను ప్రకటించాయి.

Banks: ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్.. రూల్స్ మార్చిన బ్యాంకులు..
Money
Srinivas Chekkilla
|

Updated on: Feb 02, 2022 | 6:13 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా తమ రోజువారీ లావాదేవీల సేవల్లో కొన్ని మార్పులను ప్రకటించాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు SBI, దాని తక్షణ చెల్లింపు సేవ (IMPS) లావాదేవీలపై పరిమితిని పెంచింది. SBI ఖాతాదారులు రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంక్ నోటిఫికేషన్‌లో పేర్కొంది, ఇది ప్రస్తుత పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది. SBI YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే రూ. 5 లక్షల వరకు IMPS లావాదేవీలకు SBI కస్టమర్‌లు ఎటువంటి సేవా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

బ్యాంక్ ఆఫ్ బరోడా తన చెక్ చెల్లింపుల వ్యవస్థలో మార్పులను ప్రకటించింది. లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల ముందస్తు సమాచారం అందించాలని బ్యాంకు ఖాతాదారులను అభ్యర్థించింది. కస్టమర్‌లు సమాచారాన్ని అందజేస్తే, CTS క్లియరింగ్ సమయంలో బ్యాంక్ బేస్ బ్రాంచ్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ ఫోన్ కాల్ లేకుండానే హై వాల్యూ చాక్‌లను పాస్ చేయవచ్చుని తెలిపింది.

ఖాతాదారుల ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల EMI లేదా మరేదైనా వాయిదా చెల్లింపులో విఫలమైతే, రూ. 250 జరిమానా విధిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఇంతకుముందు ఈ జరిమానా రూ. 100గా ఉండేది.

Read Also.. Assaulted in Metaverse: మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్..! మహిళ సంచలన ఆరోపణలు..