SBI: యువ వ్యాపారవేత్తలకు SBI గుడ్ న్యూస్.. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానున్న సేవలు..

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:45 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) స్టార్టప్ బ్రాంచిల పేరుతో ప్రత్యేక శాఖలను ఏర్పాటుచేస్తోంది. కొత్తగా కంపెనీలు పెట్టాలనుకునేవారికి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ను అందించేందుకు SBI ఈబ్రాంచిలను..

SBI: యువ వ్యాపారవేత్తలకు SBI గుడ్ న్యూస్.. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానున్న సేవలు..
Follow us on

SBI: ఉద్యోగాలు చేయడం కన్నా.. ఉద్యోగాలు సృష్టించాలనే ఆలోచనలతో చాటా మంది యువత ముందుకొచ్చి వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. అయితే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే పెద్ద ప్రొసెస్, ముఖ్యంగా నిధులు సమకూర్చుకోవడం అతి పెద్ద సమస్య, కంపెనీ పెట్టడమంటే కోట్లలో వ్యవహారం.. అందుకే చాలా మంది వెనకడుగు వేస్తారు. మరికొంత మంది పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నా.. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) స్టార్టప్ బ్రాంచిల పేరుతో ప్రత్యేక శాఖలను ఏర్పాటుచేస్తోంది. కొత్తగా కంపెనీలు పెట్టాలనుకునేవారికి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ను అందించేందుకు SBI ఈబ్రాంచిలను ప్రారంభిస్తుంది.

తొలి బ్రాంచిని స్టార్టప్ లకు కేంద్రంగా ఉన్న బెంగళూరులోని కోరమంగళలో ప్రారంభించింది. తరువాత రెండో బ్రాంచిని గురుగ్రామ్ లో, మూడో బ్రాంచిని హైదరాబాద్ లో ప్రారంభించనున్నామని ఎస్ బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. కంపెనీ ప్రారంభ దశ మొదలుపెట్టి.. స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయ్యే వరకు స్టార్టప్ కంపెనీలకు అవసరమైన తోడ్పాటును SBI అందిస్తుంది. కంపెనీ ప్రారంభించడానికి రుణాలతో పాటు, డిపాజిట్లు, రెమిటెన్సులు, చెల్లింపులు, ఫారెక్స్, బీమా మొదలైన సేవలతో పాటు న్యాయ సలహాలు, డీమాట్, ట్రేడింగ్ ఖాతాలు మొదలైన అన్ని సేవలు ఈస్టార్టప్ బ్రాంచిలలో అందిచనున్నారు. కేవలం ఈస్టార్టప్ బ్రాంచిలలో ఇతర బ్యాంకింగ్ సేవలు అందిచబడవు. కేవలం స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన సేవలనే అందిస్తుంది.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..