Money9: తండ్రి ఆస్తిలో కుమార్తెలకు హక్కు ఉంటుందా? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి..

Money9: భారతీయ సంప్రదాయం ప్రకారం, సామాజిక అంశాల ప్రకారం ఆస్తి పంపకాలలో కుమార్తె, కుమారుడు విషయంలో అనేక విధానాలు అవలంభిస్తుంటారు భారతీయులు.

Money9: తండ్రి ఆస్తిలో కుమార్తెలకు హక్కు ఉంటుందా? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి..
justice
Follow us

|

Updated on: Aug 17, 2022 | 5:57 PM

Money9: భారతీయ సంప్రదాయం ప్రకారం, సామాజిక అంశాల ప్రకారం ఆస్తి పంపకాలలో కుమార్తె, కుమారుడు విషయంలో అనేక విధానాలు అవలంభిస్తుంటారు భారతీయులు. అయితే చట్టం ప్రకారం మాత్రం ఒకే విధానం ఉంటుంది. తండ్రి ఆస్తిలో కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో.. కూతురుకి కూడా అంతే హక్కు ఉంటుంది. ఆ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇక ఆస్తులపై పన్నులు, పరిమితులు కూడా ఉంటాయి. పన్ను విధనాల్లోనూ తేడాలు ఉంటాయి.

హిందూ వారసత్వ చట్టం 1956ను 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం, పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుంది. కూతురు పెళ్లి అయినా, వితంతువు అయినా, అవివాహితైనా లేదా తన భర్తచే విడిచిపెట్టబడినా, ఆమె పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో వాటాను పొందుతుంది. అయితే ఇక్కడ మరో షరతు ఉంది. ఆమె తండ్రి సెప్టెంబరు 9, 2005 వరకు జీవించి ఉంటేనె కుమార్తె పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు తండ్రి మరణించినట్లయితే, కుమార్తెకు పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటా లభించదు.

అయితే, 2020లో సుప్రీంకోర్టు మళ్లీ ఈ వ్యవస్థను మార్చింది. ఈ రూల్ ను మారుస్తూ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు తండ్రి మరణించినా, కుమార్తెకు కూడా తన పూర్వీకుల ఆస్తిపై కొడుకులకు ఉన్న హక్కునే కలిగి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తండ్రి తన ఆస్తిని సొంతంగా సంపాదించినట్లయితే, అతను తన ఆస్తిని కుమార్తెకు ఇవ్వాలా వద్దా అనేది తండ్రి కోరిక ప్రకారమే జరుగుతుంది. కానీ వీలునామా రాయకుండానే తండ్రి చనిపోతే, కూతురు కూడా ఆ ఆస్తిలో భాగం పంచుకోవచ్చు. ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు కొత్త తీర్పునిచ్చింది. దీని ప్రకారం, ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని కుమారులతో పాటు అతని కుమార్తె కూడా అతని ఆస్తికి అర్హులు. ఆస్తి వాటాలో ఆమె తండ్రి సోదరుడి కుమారుల కంటే కుమార్తెకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక బంగారం విషయానికి వస్తే..

తల్లి తన వివాహిత కుమార్తెతో నివసిస్తున్నట్లయితే.. పన్ను సంబంధిత విషయాలలో తల్లి వద్ద ఉంచిన బంగారు ఆభరణాలు కుమార్తెకు సంబంధించిన అదనపు ఆభరణాలుగా పరిగణించరు. అలాంటి సందర్భాల్లో కుమార్తెతో నివసిస్తున్న తల్లిని ఆమె అత్తమామల కుటుంబంలో సభ్యురాలిగా పరిగణిస్తారు. అయితే, ఇటీవల తీసుకువచ్చిన ఈ విధానం దేశ ప్రజలకు నిజంగా శుభవార్తే అని చెప్పాలి.

ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్1994 నాటి (CBDT) నోటిఫికేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి కొంత మొత్తంలో బంగారు ఆభరణాలు కలిగి ఉండటానికి పరిమితి ఉంది. అయితే, ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో CBDT ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. బంగారు ఆభరణాలపై పరిమితి నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం వివాహిత స్త్రీ మొత్తం 500 గ్రాముల బంగారు ఆభరణాలను కలిగి ఉండవచ్చు. అవివాహిత మహిళలకు ఈ పరిమితి 250 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే పురుషుల విషయానికి వస్తే.. వివాహితుడైనా, అవివాహితుడైనా కుటుంబంలోని ప్రతి సభ్యునికి 100 గ్రాముల బంగారం కలిగి ఉండే అవకాశం ఉంది.

తండ్రి లేనప్పుడు పెళ్లయిన కూతుళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయి..

తండ్రి పేరుమీదున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా మొత్తం ఎవరికి చెందుతుంది? వివాహిత కుమార్తెల హక్కులు? అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య ఎలా పంపకాలు చేస్తారు? పూర్వీకుల ఆస్తిని ఏ విధంగా విభజిస్తారు? తండ్రి పూర్వీకుల ఆస్తిలో కొడుకులు, కుమార్తెల హక్కులు ఏంటి? ఒంటరి తల్లి బిడ్డను దత్తత తీసుకుంటే, తండ్రి ఆస్తిలో కుమార్తె, బిడ్డకు చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇలాంటి పూర్తి సమాచారం Money9 యాప్‌లోనూ లభిస్తుంది. ఈ సమాచారం అంతా తెలుసుకోవాలంటే.. ఇప్పుడే Money9 అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్‌ని లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

మనీ9 అంటే ఏమిటి?

Money9 OTT యాప్ Google Play Store, iOSలో అందుబాటులో ఉంది. ఆర్థిక పరమైన అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఏడు భాషల్లో జరుగుతుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన అనేక విషయాలు ఇందులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం.. Money9 యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. ఆర్థిక అంశాలపై అవగాహనను పెంచుకోండి. Money9ను ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..