Apollo: సమాజ సేవలో అపోలో మరో ముందడుగు.. పేదలకు ఉచిత కిడ్నీ ఆరోగ్య పరీక్షలు..
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థలో గురువారం ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్స్ వైద్య నిపుణులు మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషకాహార భోజనాన్ని కూడా అందించారు.

సికింద్రాబాద్, 13 మార్చి 2025: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థలో గురువారం ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్స్ వైద్య నిపుణులు మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా పేదలు, అవసరమైన వారికి ఉచిత యూరియా, క్రియాటినిన్ పరీక్షలు నిర్వహించారు.. అవసరమైన వారికి మందులను తీసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక ఆరోగ్య సేవలో భాగంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ పోషకాహార భోజనం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్స్ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు మూత్రపిండాల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. మూత్రపిండ ఆరోగ్యం, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD) ప్రమాదాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పుల గురించి సవివరంగా తెలియజేశారు.

Apollo Service
పేదలకు ఉచిత కిడ్నీ ఆరోగ్య పరీక్షలు
ఈ సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుధాకర రావు మాట్లాడుతూ.. “మేము అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని విశ్వసిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమం ద్వారా, పేద ప్రజలకు అవసరమైన మూత్రపిండ ఆరోగ్య పరీక్షలు మరియు పోషకాహారాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తించడం చాలా అవసరం. ఈ పరీక్షల ద్వారా, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం.” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 5,000కి పైగా ఉచిత మూత్రపిండాల పరీక్షలు నిర్వహించబడగా, ప్రజలు తమ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకుని, అవసరమైనప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా పొందాలనే విషయాన్ని గుర్తించారు.

Apollo Community Service
అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ చికిత్సతో పాటు మూత్రపిండ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తమ కృషి కొనసాగుతుందని అపోలో యాజామాన్యం తెలిపింది.




